Blind Womens T20 World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్.. తొలి అంధ మహిళల టీ20 వరల్డ్ కప్ కైవసం

ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.

Blind Womens T20 World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్.. తొలి అంధ మహిళల టీ20 వరల్డ్ కప్ కైవసం

Updated On : November 23, 2025 / 7:46 PM IST

Blind Womens T20 World Cup 2025: భారత్ కు చెందిన అంధ మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలి మహిళల అంధుల టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా నేపాల్ తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్ లో మన అమ్మాయిలు దుమ్మురేపారు. 7 వికెట్ల తేడాతో భారత్ విక్టరీ కొట్టింది. తుది పోరులో టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.

115 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 12.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లలో పులా సారెన్ మెరిసింది. 27 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేసింది. కొలంబోలోని పి సారా ఓవల్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది.

తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, యూఏఈ, నేపాల్ జట్లు పాల్గొన్నాయి. నవంబర్ 11న ఢిల్లీలో ఈ టోర్నీ ప్రారంభమైంది. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది భారత్. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మన అమ్మాయిలు అద్భుతంగా రాణించారు. తిరుగులేని విజయాలు అందించారు. ఇక ఫైనల్ లోనూ గెలిచి భారత్ ను విశ్వ విజేతగా నిలిపారు.

Also Read: కొద్దిగంటల్లో పెళ్లి.. సడన్ గా ఆగిన స్మృతి మంథాన వివాహం.. కారణం ఇదే..