AUS vs ENG Two debutants named in Australias playing XI for first Ashes Test
AUS vs ENG : ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం (నవంబర్ 21) నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు రెండు రోజుల ముందే ఇంగ్లాండ్ జట్టు దాదాపుగా తుది జట్టును ప్రకటించింది. 12 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇక ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా మ్యాచ్ (AUS vs ENG)కు ఒక రోజు ముందుగానే తమ తుది జట్టును ప్రకటించింది. ఇందులో ఇద్దరు ఆటగాళ్లు పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేయనున్నారు. వారే ఓపెనర్ జేక్ వెదరాల్డ్, పేసర్ బ్రెండన్ డాగెట్.
రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో స్టీవ్ స్మిత్ సారథ్యంలోనే ఆసీస్ బరిలోకి దిగనుంది. మార్నస్ లబుషేన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. అతడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని స్టీవ్ స్మిత్ వెల్లడించాడు. మార్నస్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేటప్పుడు తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని, అది జట్టుకు భారీ స్కోరు సాధించేందుకు ఉపయోగపడుతుందన్నాడు.
HERE WE GO 🤩
The Australian XI for the first Ashes Test in Perth 👇 pic.twitter.com/6lXwDZ7hBe
— cricket.com.au (@cricketcomau) November 20, 2025
గత రెండు వారాలుగా క్వీన్స్‌ల్యాండ్ తరఫున షీల్డ్, వన్డే క్రికెట్‌లో అతను బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. అతడు యాషెస్ సిరీస్‌లోనూ అదే విధమైన ఫామ్‌ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు.
ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ఇదే..
జేక్ వెదరాల్డ్, ఉస్మాన్ ఖవాజా , మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ , బ్రెండన్ డాగెట్, స్కాట్ బొలాండ్.
HERE WE GO 🤩
The Australian XI for the first Ashes Test in Perth 👇 pic.twitter.com/6lXwDZ7hBe
— cricket.com.au (@cricketcomau) November 20, 2025