Virat Kohli: విరాట్ కోహ్లీ కుటుంబం నుంచి ఇద్దరు లెగ్-స్పిన్నర్లు! ఆ ఇద్దరు వీరే.. రివీల్ చేసిన చిన్ననాటి కోచ్..

అతను చాలా సాధారణ పిల్లవాడు. తన మామ పేరును ఎప్పుడూ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించలేదు అని రాజ్ కుమార్ తెలిపారు.

Virat Kohli: విరాట్ కోహ్లి ఎంత గొప్ప బ్యాట్స్ మెన్ అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రన్ మెషీన్ గా పేరు పొందాడు విరాట్ కోహ్లి. ఫార్మాట్ ఏదైనా వన్స్ గ్రౌండ్ లోకి ఎంటర్ అయితే.. పరుగుల వరద పారాల్సిందే. తన కెరీర్ లో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లి. అటువంటి క్రికెటర్ ఫ్యామిలీ నుంచి మరికొందరు క్రికెటర్లు రెడీ అవుతున్నారు. అయితే వారు విరాట్ మాదిరి బ్యాట్స్ మెన్స్ కాదు.. వారు లెగ్ స్పిన్నర్లు. ఈ విషయాన్ని విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ రివీల్ చేశారు. విరాట్ కుటుంబం నుంచి వస్తున్న ఇద్దర ఎమర్జింగ్ లెగ్ స్పిన్నర్లను ఆయన పరిచయం చేశారు.

జూలై 6న ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ వేలంలో కోహ్లీ మేనల్లుడు, అతని సోదరుడు వికాస్ కుమారుడు ఆర్యవీర్ సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ కు అమ్ముడయ్యాడు. ఢిల్లీ ప్రీమియర్ T20 లీగ్‌లో తొలిసారి ఆటగాళ్ల పూల్‌లో చోటు దక్కించుకున్న ఆర్యవీర్‌ను సౌత్ ఢిల్లీ లక్ష రూపాయలకు సొంతం చేసుకుంది.

“నాకు సంతోషంగా ఉంది. ఆర్యవీర్ ఒక ఆశాజనకమైన, నిజాయితీగల, కష్టపడి పనిచేసే పిల్లాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ అతని కెరీర్‌లో ముందుకు సాగడానికి మంచి వేదిక” అని రాజ్‌కుమార్ అన్నారు. ఆర్యవీర్ ఎప్పుడైనా కోహ్లీ ఇంటిపేరును కలిగి ఉండటం వల్ల ఒత్తిడికి లోనయ్యాడా అన్న ప్రశ్నకు..”లేదు, కుటుంబం అతనిని ఎప్పుడూ దేనికీ ఒత్తిడి చేయలేదు. అతను చాలా సాధారణ పిల్లవాడు. తన మామ పేరును ఎప్పుడూ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించలేదు” అని రాజ్ కుమార్ తెలిపారు.

Also Read: నాన్న, అన్న సడన్ డెత్.. డబ్బుల్లేవు.. అప్పుడు వచ్చిందో ఛాన్స్… ఆకాష్ దీప్ లైఫ్ లో..

విరాట్ గొప్ప బ్యాట్స్‌మన్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. దాంతో అతని మేనల్లుడు అతని అడుగుజాడల్లోనే నడుస్తాడని అంతా అనుకుంటారు. కానీ ఆర్యవీర్ లెగ్ స్పిన్నర్. ఇక విరాట్ సోదరి భావన కుమారుడు ఆయుష్ కూడా అంతే. ఆర్యవీర్, ఆయుష్ ఇద్దరూ పశ్చిమ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతారు. అక్కడ విరాట్ సంవత్సరాల క్రితం రాజ్ కుమార్ వద్ద శిక్షణ పొందాడు. ఆర్యవీర్ మంచి బౌలర్. అతనే కాదు, ఆయుష్ కూడా మంచి లెగ్ స్పిన్నర్ అని రాజ్ కుమార్ అన్నారు.

అంతకుముందు రోజు, సౌత్ ఢిల్లీ జట్టు దిగ్వేష్ రతిని రూ. 38 లక్షలకు తీసుకుంది. ఇక సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ. 39 లక్షలకు సిమర్జీత్ సింగ్‌ను తీసుకుంది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌తో పాటు, గత రెండు సంవత్సరాలుగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడకపోయినా, 29 ఏళ్ల ఆల్ రౌండర్ కున్వర్ బిధురిని కూడా సౌత్ ఢిల్లీ జట్టు ఎంపిక చేసింది. ఇటీవల ఢిల్లీ తరపున విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన వికెట్ కీపర్ తేజస్వి దహియాను కూడా వారు ఎంపిక చేశారు.