×
Ad

U19 World Cup 2026 : ఐదు వికెట్ల‌తో చెల‌రేగిన హెనిల్ పటేల్.. భార‌త్ ముందు స్వ‌ల్ప ల‌క్ష్యం

అండర్‌-19 వరల్డ్‌ కప్‌ టోర్నీలో (U19 World Cup 2026) భాగంగా బులవాయో వేదికగా యూఎస్ఏతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు విజృంభించారు.

U19 World Cup 2026 IND u19 vs USA u19 team india target 108

U19 World Cup 2026 : అండర్‌-19 వరల్డ్‌ కప్‌ టోర్నీలో భాగంగా బులవాయో వేదికగా యూఎస్ఏతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు విజృంభించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఎస్ఏ 35.2 ఓవ‌ర్ల‌లో 107 ప‌రుగులకు ఆలౌటైంది. దీంతో భార‌త్ ముందు 108 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యం నిలిచింది.

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు చుక్క‌లు చూపిస్తున్న ప్లేయ‌ర్లు.. రాజీనామా చేయాల్సిందే.. స్టేడియానికి రాని ఆట‌గాళ్లు..

యూఎస్ఏ బ్యాట‌ర్ల‌లో నితీష్ సుదిని (36), సాహిల్ గార్గ్(16), అర్జున్ మహేష్(16), అద్నిత్ ఝాంబ (18)లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. భారత బౌల‌ర్ల‌లో హెనిల్ పటేల్ 5 వికెట్ల‌తో చెల‌రేగాడు. దీపేశ్‌ దేవేంద్ర, ఖిలాన్‌ పటేల్‌, ఆర్ఎస్ అంబ్రిష్, వైభ‌వ్ సూర్య‌వంశీలు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.