U19 World Cup 2026
U19 World Cup : అండర్-19 ప్రపంచ కప్ లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు డీఎల్ఎస్ పద్దతిలో బంగ్లాదేశ్‌ను 18 పరుగుల తేడాతో ఓడించింది.
Also Read : WPL 2026 : ముంబై ఇండియన్స్‌ను మళ్లీ ఓడించిన యూపీ వారియర్జ్
అండర్-19 ప్రపంచ కప్ లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. డీఎల్ఎస్ పద్దతిలో బంగ్లాదేశ్ జట్టును 18 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 49 ఓవర్లకు కుదించారు. దీంతో భారత్ 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయింది. అభిజ్ఞాన్ కుండు (112 బంతుల్లో 80 పరుగులు), వైభవ్ సూర్యవంశీ (67 బంతుల్లో 72 పరుగులు) కీలక ఇన్సింగ్స్ ఆడారు.
బంగ్లాదేశ్ U19 జట్టు 17.2 ఓవర్లలో 88/2 స్కోరుతో ఉండగా వర్షం అంతరాయం కలిగించడంతో 29 ఓవర్లలో లక్ష్యాన్ని 165గా నిర్దేశించారు. విరామం తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైనప్పుడు బంగ్లాదేశ్ U19 జట్టు గెలవడానికి 70 బంతుల్లో 75 పరుగులు అవసరం. అయితే, ఆ సమయంలో బంగ్లాదేశ్ పటిష్ఠ స్థితిలో ఉంది. కానీ విహాన్ మల్హోత్రా నాలుగు ఓవర్లలో 14 పరుగులకు 4 వికెట్లు తీయడంతో మ్యాచ్ క్రమంగా భారత్ వైపుకు మొగ్గింది. బంగ్లాదేశ్ తన చివరి ఎనిమిది వికెట్లను 40 పరుగులకే కోల్పోయింది.
A CLUTCH PERFORMANCE BY VIHAAN MALHOTRA…!!!!
– India defeated Bangladesh in U-19 World Cup. 🇮🇳 pic.twitter.com/aYWG0IeUE5
— Johns. (@CricCrazyJohns) January 17, 2026
వైభవ్ సూర్యవంశీ అద్భుత క్యాచ్ ..
26వ ఓవర్ రెండో బంతికి సమియున్ బషీర్ ఏరియల్ షాట్ కు ప్రయత్నించాడు. కానీ, వైభవ్ సూర్యవంశీ బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. చాలా ఆలస్యం తరువాత థర్డ్ అంపైర్ బషీర్ ను ఔట్ గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయంతో భారత శిభిరంలో హర్షాతిరేఖాలు వ్యక్తమయ్యాయి.
2026 అండర్ -19 ప్రపంచ కప్ లో భారత్ జట్టుకు ఇది రెండో విజయం. గతంలో టీమిండియా యూఎస్ఏ జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. వరుసగా రెండో ప్రపంచ కప్ విజయంతో భారత్ ఇప్పుడు గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.