WPL 2026 : ముంబై ఇండియన్స్‌ను మళ్లీ ఓడించిన యూపీ వారియర్జ్
మహిళల ప్రీమియర్ లీగ్ 4వ సీజన్‌లో (WPL 2026) మరోసారి ముంబై ఇండియన్స్‌ను యూపీ వారియర్జ్ జట్టు ఓడించింది.
WPL 2026 UP Warriorz won by 22 runs against Mumbai Indians
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ 4వ సీజన్‌లో మరోసారి ముంబై ఇండియన్స్‌ను యూపీ వారియర్జ్ జట్టు ఓడించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులకే పరిమితమైంది. దీంతో యూపీ జట్టు 22 పరుగుల తేడాతో గెలుపొందింది.
ముంబై బ్యాటర్లలో అమేలియా కెర్ (49 నాటౌట్; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), అమన్‌జోత్ కౌర్ (41; 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మాత్రమే రాణించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (18), హేలీ మాథ్యూస్ (13) లు విఫలమయ్యారు. యూపీ బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టింది. క్రాంతి గౌడ్, సోఫీ ఎకిల్‌స్టోన్, దీప్తి శర్మ, క్లో ట్రయాన్ తలా ఓ వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. యూపీ బ్యాటర్లలో మెగ్ లానింగ్ (70; 45 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు, ఫోబ్ లీచ్ ఫీల్డ్ (61; 37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టారు.హర్లీన్ డియోల్ (25), క్లో ట్రయాన్ (21) కూడా రాణించారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాట్ సైవర్-బ్రంట్ రెండు వికెట్లు తీసింది. నికోలా కారీ, హేలీ మాథ్యూస్, అమన్‌జోత్ కౌర్ తలా ఓ వికెట్ సాధించారు.
Win on the field. Winning for the cause 🩷
Two wins in a row for the Warriorz! #UttarDega #UPWarriorz #TATAWPL #UPWvMI pic.twitter.com/SOp8hvkVH6
— UP Warriorz (@UPWarriorz) January 17, 2026
కాగా.. ఈ సీజన్‌లో యూపీ ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆ రెండు మ్యాచ్‌లు కూడా ముంబై పైనే గెలవడం విశేషం. తాజా విజయంతో యూపీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.
