U19 World Cup 2026 : హాఫ్ సెంచ‌రీల‌తో రాణించిన వైభ‌వ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్‌ కుందు.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?

అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త్ ఓ మోస్త‌రు (U19 World Cup 2026) స్కోరు సాధించింది.

U19 World Cup 2026 : హాఫ్ సెంచ‌రీల‌తో రాణించిన వైభ‌వ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్‌ కుందు.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?

U19 World Cup 2026 Bangladesh target is 239 against India

Updated On : January 17, 2026 / 6:29 PM IST

U19 World Cup 2026 : అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త్ ఓ మోస్త‌రు స్కోరు సాధించింది. భారత ఇన్నింగ్స్ మ‌ధ్య‌లో వ‌ర్షం అంత‌రాయం క‌లిగించ‌డంతో మ్యాచ్‌ను 49 ఓవ‌ర్ల‌కు కుదించారు. 48.4 ఓవ‌ర్ల‌లో భార‌త్ 238 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్ ముందు 239 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో అభిజ్ఞాన్‌ కుందు (80; 112 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), వైభ‌వ్ సూర్య‌వంశీ (72; 67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. కాన్షిక్‌ చౌహాన్ (28) ప‌ర్వాలేద‌నిపించాడు.

U19 World Cup 2026 : అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. బాబ‌ర్ ఆజామ్ రికార్డు బ్రేక్‌..


మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం కావ‌డంతో భార‌త్ ఓ మోస్త‌రు స్కోరుకే ప‌రిమిత‌మైంది. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో అల్‌ పహాద్ ఐదు వికెట్లు తీశాడు. ఇక్బాల్‌ హుస్సేన్‌ ఎమోన్, అజిజుల్‌ హకిమ్‌ తమిమ్ లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. షేక్‌ పర్వేజ్‌ జిబాన్ ఓ వికెట్ సాధించాడు.