×
Ad

U19 World Cup 2026 : ఫైసల్, ఉజైరుల్లా శ‌త‌కాలు.. సెమీస్‌లో టీమ్ఇండియా ముందు అఫ్గాన్ భారీ టార్గెట్‌..

అండ‌ర్‌-19 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో (U19 World Cup 2026) భాగంగా జ‌రుగుతున్న సెమీస్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ముందు అఫ్గాన్ భారీ టార్గెట్‌ను ఉంచింది.

U19 World Cup 2026 Semis Team India target is 311

U19 World Cup 2026 : అండ‌ర్‌-19 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా హ‌రారే వేదిక‌గా భార‌త్, అఫ్గానిస్తాన్ లు త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 310 ప‌రుగులు చేసింది. దీంతో భార‌త్ ముందు 311 ప‌రుగుల లక్ష్యం నిలిచింది.

ICC T20I rankings : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిష‌న్ దూకుడు.. ఏకంగా 32 స్థానాలు జంప్‌..

అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో ఫైసల్ షినోజాడా (110; 93 బంతుల్లో 15 ఫోర్లు), ఉజైరుల్లా నియాజై (101 నాటౌట్ ;86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు శ‌త‌కాల‌తో చెల‌రేగారు.  ఉస్మాన్ సాదత్ (39), ఖలీద్ అహ్మద్జాయ్ (31) లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు తీశారు.