Under 19 Final : ఆల్ ది బెస్ట్.. ఉరకలు వేస్తున్న యువ టీమిండియా

లీగ్‌ దశలో తొలి మ్యాచ్‌ అనంతరం కరోనా వైరస్‌ కారణంగా ఆరుగురు ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా.. టీమిండియా ఏమాత్రం ఇబ్బంది పడకుండా వరుస విజయాలు సాధించిందంటే ఈ టోర్నీలో...

Team India

Team India Vs England : అండర్‌-19 వరల్డ్‌కప్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. టోర్నీలో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న యువ భారత జట్టు.. 2022, ఫిబ్రవరి 05వ తేదీ శనివారం సాయంత్రం 6గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే ఫైనల్లో ఇంగ్లండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన యంగ్‌ ఇండియా.. క్వార్టర్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బంగ్లాదేశ్‌ను, సెమీస్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. ఇప్పటి వరకు నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన యువ భారత్‌.. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించి పాంచ్‌ పటాకా మోగించాలని భావిస్తోంది. ఇక 2016, 2018, 2020 ప్రపంచకప్‌లలోనూ ఫైనల్‌కు చేరిన యంగ్‌ఇండియా.. 24 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు అర్హత సాధించిన ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

Read More : Peru..Nazca lines : పెరూలో కూలిన విమానం..ఎడారి పర్యటనకు వెళుతున్న ఏడుగురు దుర్మరణం

లీగ్‌ దశలో తొలి మ్యాచ్‌ అనంతరం కరోనా వైరస్‌ కారణంగా ఆరుగురు ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా.. టీమిండియా ఏమాత్రం ఇబ్బంది పడకుండా వరుస విజయాలు సాధించిందంటే ఈ టోర్నీలో మన జట్టు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కీలక సెమీఫైనల్లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్‌ యష్‌ధుల్‌తో పాటు తెలుగు ఆటగాడు, వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ ఫుల్‌ జోష్‌లో ఉండగా.. హర్నూర్‌ సింగ్‌, రఘువంశీ, దినేశ్‌ మరోసారి కీలకం కానున్నారు. టోర్నీలో ఇప్పటి వరకు సమిష్టిగా రాణించిన భారత బౌలర్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. రాజ్ వర్ధన్, రవికుమార్ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు.

Read More : Statue Of Equality : ప్రధాన మంత్రి మోదీ కోసం విశ్వక్సేన ఇష్టి

ఆఫ్ స్పిన్నర్ విక్కీ నిలకడగా రాణిస్తూ..అడపదడపా వికెట్లు తీస్తున్నాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు (5 మ్యాచ్ లు 12 వికెట్లు) తీసిన బౌలర్ గా కొనసాగుతున్నాడు. మరో ఇద్దరు స్పిన్నర్లు కూడా రాణిస్తున్నారు. ఫైనల్లోనూ ఇంగ్లాండ్ పై చేయి సాధించాలని టీమిండియా బౌలర్లు తహతహలాడుతున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేయగలిగితే.. విజయం సాధించడం సులువుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్లో పోరాటాన్ని కంటిన్యూ చేయాలని..కప్ సాధించాలని ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు క్రీడాభిమానులు.