Under 19 World Cup 2026 Zimbabwe U19 opt to bowl
U19 World Cup 2026 : అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ జోరు మీదుంది. ఈ టోర్నీ సూపర్ సిక్స్‌లో భాగంగా బులవాయో వేదికగా మంగళవారం జింబాబ్వే, భారత్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
‘టాస్ గెలిస్తే మేము బ్యాటింగ్ చేయాలని అనుకున్నాము. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. వికెట్ చాలా బాగుంది. తుది జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. మొహమ్మద్ ఈనాన్ స్థానంలో ఉధవ్ మోహన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇది వ్యూహాత్మక మార్పు మాత్రమే. ‘అని ఆయుష్ మాత్రే తెలిపాడు.
జింబాబ్వే తుది జట్టు..
నథానియెల్ హ్లాబంగానా (వికెట్‌కీపర్), ధృవ్ పటేల్, కియాన్ బ్లిగ్నాట్, బ్రెండన్ సెన్జెర్ (కెప్టెన్), లీరోయ్ చివౌలా, మైఖేల్ బ్లిగ్నాట్, సింబరాషే, మకోని, టాటెండా చిముగోరో, పనాషే మజై, వెబ్‌స్టర్ మధిధి.
🚨 Toss and Team News 🚨
India U19 have been put into bat by Zimbabwe U19.
Updates ▶️https://t.co/juFENSDomr #U19WorldCup pic.twitter.com/aQVQ8K9qYT
— BCCI (@BCCI) January 27, 2026
IND vs NZ : గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌కు భారీ షాక్.. అయ్యర్‌కు మాత్రం..
భారత తుది జట్టు..
ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు (వికెట్‌కీపర్), వేదాంత్ త్రివేది, ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, ఉదవ్ మోహన్.