WTC Points Table : బిగ్ షాక్‌.. టీమ్ఇండియాను వెన‌క్కి నెట్టిన బంగ్లాదేశ్‌

WTC Points Table 2023-2025 : టీమ్ఇండియాకు బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది.

WTC Points Table 2023-2025

టీమ్ఇండియాకు బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. ఐసీసీ ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) 2023-2025 లో భాగంగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో బంగ్లాదేశ్ 150 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. దీంతో డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్‌ను వెన‌క్కి నెట్టి బంగ్లాదేశ్‌ రెండో స్థానానికి దూసుకువ‌చ్చింది. భార‌త్ మూడో స్థానానికి ప‌డిపోయింది. ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచిన పాకిస్థాన్ 24 పాయింట్లు, వంద‌శాతం విజ‌య‌శాతంతో మొద‌టి స్థానంలో ఉంది.

భార‌త్ విష‌యానికి వ‌స్తే.. టీమ్ఇండియా డ‌బ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో రెండు టెస్టులు ఆడింది. ఓ మ్యాచులో గెలిచి మ‌రో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. టీమ్ఇండియా ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆడిన ఒక్క మ్యాచులో గెల‌వ‌డంతో ఆ జ‌ట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. పాయింట్లు భార‌త్‌కే ఎక్కువ ఉన్న‌ప్ప‌టికీ మూడో స్థానానికి ఎందుకు ప‌డిపోయింది అనేగా మీ డౌట్‌.

Spirit Of Cricket : నిజ‌మైన క్రీడాస్ఫూర్తి.. జేజేలు కొడుతున్న నెటిజ‌న్లు.. ఏం జ‌రిగిందంటే..?

డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో ర్యాంకుల‌ను విజ‌యాల శాతం ఆధారంగా కేటాయిస్తారు. భార‌త్‌ విజ‌యాల శాతం 66.67 ఉండ‌గా, బంగ్లాదేశ్ విజ‌య‌శాతం 100గా ఉంది. దీంతో బంగ్లాదేశ్ రెండో స్థానానికి చేర‌గా భార‌త్ మూడుకు ప‌డిపోయింది. ఆస్ట్రేలియా ఐదు టెస్టు మ్యాచులు ఆడ‌గా రెండు మ్యాచుల్లో గెలిచి మ‌రో రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. 18 పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉండ‌గా 30 విజ‌య‌శాతంతో ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో నిలిచింది.

ఆ త‌రువాతి స్థానాల్లో వెస్టిండీస్ (16.67), ఇంగ్లాండ్ (15), శ్రీలంక‌(0), న్యూజిలాండ్(0) లు ఉన్నాయి. ద‌క్షిణాఫ్రికా డ‌బ్ల్యూటీసీ సైకిల్‌లో ఇంత వ‌ర‌కు ఒక్క టెస్టు మ్యాచ్ ఆడ‌లేదు. డిసెంబ‌ర్ 26 నుంచి ద‌క్షిణాఫ్రికా భార‌త్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడ‌నుంది.

Greatest Batters of all time : ఆల్ టైమ్ గ్రేట్ ఇండియన్ బ్యాట‌ర్ ఎవ‌రు..? స‌చిన్, కోహ్లీ కాదా..? మరి ఇంకెవ‌రంటే..?

ట్రెండింగ్ వార్తలు