Vaibhav Suryavanshi Creates History Breaks Unmukt Chand Record in Youth ODI cricket
Vaibhav Suryavanshi : టీమ్ఇండియా యువ సంచలనం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు. యూత్ వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బ్రిస్సేన్ వేదికగా ఆస్ట్రేలియా అండర్-19తో రెండో వన్డే మ్యాచ్‌లో 6 సిక్సర్లు కొట్టడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఉన్ముక్త్ చంద్ 21 ఇన్నింగ్స్‌ల్లో 38 సిక్సర్లు కొట్టగా సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కేవలం 10 ఇన్నింగ్స్‌ల్లోనే 41 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో వీరిద్దరి తరువాత జావాద్ అబ్రార్, షాబైబ్ ఖాన్, యశస్వి జైస్వాల్ లు ఉన్నారు.
యూత్ వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
* వైభవ్ సూర్యవంశీ (భారత్) – 10 ఇన్నింగ్స్‌ల్లో 41 సిక్సర్లు
* ఉన్ముక్త్ చంద్ (భారత్) – 21 ఇన్నింగ్స్‌ల్లో 38 సిక్సర్లు
* జావాద్ అబ్రార్ (బంగ్లాదేశ్) – 22 ఇన్నింగ్స్‌ల్లో 35 సిక్సర్లు
*షాబైజ్ ఖాన్ (పాకిస్తాన్) – 24 ఇన్నింగ్స్‌ల్లో 31 సిక్సర్లు
* యశస్వి జైస్వాల్ (భారత్) – 27 ఇన్నింగ్స్‌ల్లో 30 సిక్సర్లు
* తౌహీద్ హృదయ్ (బంగ్లాదేశ్) – 45 ఇన్నింగ్స్‌ల్లో 30 సిక్సర్లు
ఇక ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 68 బంతులు ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 6 సిక్సర్లు బాది 70 పరుగులు చేశాడు. సూర్యవంశీతో పాటు విహాన్ మల్హోత్రా (70), అభిజ్ఞాన్ కుండు (71)లు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్-ఏ 49.4 ఓవర్లలో 300 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో విల్ బైరోమ్ మూడు వికెట్లు తీశాడు. యష్ దేశ్‌ముఖ్ రెండు వికెట్లు పడగొట్టాడు.