IPL 2025 Auction : వెంక‌టేశ్ అయ్య‌ర్‌కు జాక్ పాట్‌.. క‌ళ్లు చెదిరే ధ‌ర‌..

టీమ్ఇండియా ఆటగాడు వెంక‌టేశ్ అయ్య‌ర్ ఐపీఎల్ మెగా వేలం 2025లో జాక్ పాట్ కొట్టాడు.

Venkatesh Iyer hits jackpot return to KKR

టీమ్ఇండియా ఆటగాడు వెంక‌టేశ్ అయ్య‌ర్ ఐపీఎల్ మెగా వేలం 2025లో జాక్ పాట్ కొట్టాడు. ఏకంగా రూ. 23.75 కోట్లు కొల్ల‌గొట్టాడు. అత‌డిని కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ సొంతం చేసుకుంది.

రూ.2 కోట్ల కనీస ధరతో ఈ వేలంలో వ‌చ్చాడు ఈ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌. అత‌డి కోసం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు పోటీప‌డ్డాయి. రూ.5 కోట్లు, రూ.10 కోట్లు, రూ.15 కోట్లు, రూ.20 కోట్లు దాటినా ఎక్క‌డా కూడా ద‌గ్గ‌లేదు. రూ.23 కోట్లు దాటినా ఆగ‌లేదు. చివ‌ర‌కు బెంగ‌ళూరు వెన‌క్కి త‌గ్గింది. దీంతో రూ.23.75 కోట్ల‌కు కోల్‌క‌తా అత‌డిని సొంతం చేసుకుంది.

IPL 2025 Auction : అరెరె.. కేఎల్ రాహుల్‌కే ఎందుకిలా జ‌రుగుతోంది ? ఆర్‌సీబీకి వెళ్తాడ‌నుకుంటే..?

కాగా.. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో వెంక‌టేశ్‌ కోల్‌క‌తాకు ఆడాడు. అత‌డిని ఎంతైనా సొంతం చేసుకోవాల‌నే కేకేఆర్ బ‌రిలోకి దిగిన‌ట్లుగా తెలుస్తోంది.