IPL 2025 Auction : అరెరె.. కేఎల్ రాహుల్‌కే ఎందుకిలా జ‌రుగుతోంది ? ఆర్‌సీబీకి వెళ్తాడ‌నుకుంటే..?

ఐపీఎల్ మెగా వేలంలో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు కేఎల్ రాహుల్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది

IPL 2025 Auction : అరెరె.. కేఎల్ రాహుల్‌కే ఎందుకిలా జ‌రుగుతోంది ? ఆర్‌సీబీకి వెళ్తాడ‌నుకుంటే..?

KL Rahul

Updated On : November 24, 2024 / 6:07 PM IST

ఐపీఎల్ మెగా వేలంలో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు కేఎల్ రాహుల్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. భారీ మొత్తానికి అమ్ముడుపోతాడ‌ని భావించ‌గా.. నామ‌మాత్ర‌పు ధ‌ర‌కే అత‌డు అమ్ముడుఅయ్యాడు. అత‌డిని రూ.14 కోట్ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ సొంతం చేసుకుంది.

రూ.2 కోట్ల కనీస ధరతో ఈ వేలంలో వ‌చ్చాడు ఈ స్టార్ బ్యాట‌ర్‌. మొద‌ట అత‌డి కోసం ఆర్‌సీబీ, కేకేఆర్ పోటీ ప‌డ్డాయి. మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ వ‌చ్చాయి. దీంతో ఆర్‌సీబీ, కేకేఆర్ రేసు నుంచి వెన‌క్కి త‌గ్గాయి. ఆఖ‌రికి సీఎస్‌కే కూడా త‌ప్పుకోవ‌డంతో ఢిల్లీ సొంతం అయ్యాడు రాహుల్‌. కాగా.. ఈ సీజ‌న్‌లో రాహుల్‌కు ఢిల్లీ సార‌థ్య బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించే అవ‌కాశం ఉంది.

IPL Auction 2025 : టీమ్ఇండియా బౌల‌ర్ల పై కాసుల వ‌ర్షం.. చాహ‌ల్‌కు రూ.18 కోట్లు, సిరాజ్‌కు రూ.12.25కోట్లు, ష‌మీకి..

ఇదిలా ఉంటే.. వేలానికి ముందు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు కేఎల్ రాహుల్‌ను ద‌క్కించుకుంటుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. వేలానికి వ‌చ్చే స‌రికి ఎందుక‌నో అత‌డి కోసం ఆర్‌సీబీ పెద్ద‌గా ప్ర‌య‌త్నించ‌లేదు. కాగా.. ఐపీఎల్ 2024లో రాహుల్ ల‌క్నోకు కెప్టెన్‌గా వ్య‌వ‌హరించాడు.

ఓ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోవ‌డంతో ఆ జ‌ట్టు య‌జ‌మాని సంజీవ్ గొయెంకా మైదానంలోనే రాహుల్ పై తీవ్రంగా మండిప‌డ్డాడు. దీనిపై రాహుల్ అసంతృప్తితో ఉన్నాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో మెగా వేలానికి ముందు అత‌డిని ల‌క్నో రిటైన్ చేసుకోలేదు. వేలానికి విడిచిపెట్టింది.

Rishabh Pant : కోట్లు కొల్ల‌గొట్టిన పంత్.. అయ్య‌ర్ రికార్డు బ్రేక్‌.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర