IPL Auction 2025 : టీమ్ఇండియా బౌల‌ర్ల పై కాసుల వ‌ర్షం.. చాహ‌ల్‌కు రూ.18 కోట్లు, సిరాజ్‌కు రూ.12.25కోట్లు, ష‌మీకి..

ఐపీఎల్ మెగా వేలం ఆస‌క్తిక‌రంగా సాగుతోంది.

IPL Auction 2025 : టీమ్ఇండియా బౌల‌ర్ల పై కాసుల వ‌ర్షం.. చాహ‌ల్‌కు రూ.18 కోట్లు,  సిరాజ్‌కు రూ.12.25కోట్లు, ష‌మీకి..

IPL 2025 Mega Auction Shami Chahal Siraj gets huge money

Updated On : November 24, 2024 / 5:22 PM IST

ఐపీఎల్ మెగా వేలం ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. టీమ్ఇండియా ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసేందుకు ప్రాంఛైజీలు పోటీప‌డుతున్నాయి. టీమ్ఇండియా వెట‌ర‌న్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ, చాహ‌ల్‌, సిరాజ్‌ల‌పై పై కాసుల వ‌ర్షం కురిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జ‌ట్టు ష‌మీని రూ.10 కోట్ల‌కు సొంతం చేసుకుంది.

రూ.2 కోట్ల క‌నీస ధ‌ర‌తో ష‌మీ వేలంలోకి వ‌చ్చాడు. అత‌డి కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోటీ పడ్డాయి. అయితే.. కేకేఆర్, సీఎస్‌కే పోటీ నుంచి త‌ప్పుకోగా ఎస్ఆర్ హెచ్ సొంతం చేసుకుంది. కాగా.. గ‌తంలో గుజ‌రాత్ టైటాన్స్ త‌రుపున ష‌మీ ఆడాడు. అయితే.. మెగా వేలానికి ముందు అత‌డిని రిటైన్ చేసుకోలేదు గుజ‌రాత్‌.

Rishabh Pant : కోట్లు కొల్ల‌గొట్టిన పంత్.. అయ్య‌ర్ రికార్డు బ్రేక్‌.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర

ఇక యుజ్వేంద్ర చాహ‌ల్‌ను రూ.18 కోట్ల‌కు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన అత‌డి కోసం ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్ పోటీప‌డ్డాయి. ఆ త‌రువాత పంజాబ్ కింగ్స్ రేసులోకి వ‌చ్చింది. ఆఖ‌రికి అత‌డిని సొంతంచేసుకుంది.

టీమ్ఇండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌ను రూ.12.25 కోట్ల‌కు గుజ‌రాత్ ద‌క్కించుకుంది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన అత‌డి కోసం గుజ‌రాత్, చెన్నైలు పోటీప‌డ్డాయి. మ‌ధ్య‌లో రాజ‌స్థాన్ ఆస‌క్తి చూపింది. ఆఖ‌రికి గుజ‌రాత్ సొంతం చేసుకుంది.

IND vs AUS : ముగిసిన మూడో రోజు ఆట‌.. తొలి టెస్టులో విజ‌యం దిశ‌గా భార‌త్‌.. ఇంకో ఏడు వికెట్లు..