IND vs AUS : ముగిసిన మూడో రోజు ఆట.. తొలి టెస్టులో విజయం దిశగా భారత్.. ఇంకో ఏడు వికెట్లు..
పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం దిశగా దూసుకువెలుతోంది.

IND vs AUS Day 3 Stumps india need 7 wickets to win perth test
IND vs AUS : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం దిశగా దూసుకువెలుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 4.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది. మరో రెండు రోజులు మ్యాచ్ మిగిలి ఉండగా భారత్ మరో ఏడు వికెట్లు తీస్తే విజయం సాధిస్తుంది. ఆస్ట్రేలియా గెలవాలంటే 522 పరుగులు అవసరం. ఉస్మాన్ ఖవాజా (3) క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఏదైన అద్భుతం జరిగితే తప్ప ఆస్ట్రేలియా గెలవడం కష్టమే.
534 పరుగుల విజయలక్ష్యంలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు వరుస షాకులు ఇచ్చారు. తొలి ఓవర్ నాలుగో బంతికే యువ ఆటగాడు మెక్‌స్వీనీ బుమ్రా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఆసీస్ స్కోరు బోర్డుపై పరుగు కూడా చేరకముందే వికెట్ కోల్పోయింది. ఆ తరువాత తన రెండో ఓవర్‌లో సిరాజ్ నైట్ వాచ్‌మెన్ పాట్ కమిన్స్ (2) ను ఔట్ చేయగా ఆ వెంటనే మూడో రోజు ఆఖరి ఓవర్‌లో బుమ్రా మార్నస్ లబుషేన్ (3) ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు.
IND vs AUS : విరాట్ కోహ్లీ శతకం.. ఆస్ట్రేలియా లక్ష్యం 534
అంతకముందు యశస్వి జైస్వాల్(161 297 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (100 నాటౌట్ 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు)లు శతకాలతో చెలరేగగా కేఎల్ రాహుల్ (77 176 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ బాదగా టీమ్ఇండియా తన రెండో ఇన్నింగ్స్‌ను 487-6 వద్ద డిక్లేర్ చేసింది.
ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
AUS vs IND : హిట్‌మ్యాన్ వచ్చేశాడు.. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్
AUSTRALIA 12/3 ON DAY 3 STUMPS.
– Australia need 522 more to win. Jaiswal, Kohli, Rahul and Bumrah and heroes. 🙇♂️🇮🇳 pic.twitter.com/RJUyPRJtyL
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 24, 2024