AUS vs IND : హిట్‌మ్యాన్‌ వచ్చేశాడు.. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలోని పెర్త్ లో అడుగు పెట్టారు. బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరగనుంది.

AUS vs IND : హిట్‌మ్యాన్‌ వచ్చేశాడు.. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్

Rohit Sharma

Updated On : November 24, 2024 / 2:17 PM IST

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలోని పెర్త్ లో అడుగు పెట్టారు. బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ లో భాగంగా మొదటి టెస్టు పెర్త్ వేదికగా జరుగుతోంది. ఈ టెస్టుకు రోహిత్ శర్మ గైర్హాజరు కావడంతో కెప్టెన్సీ బాధ్యతలు బౌలర్ జస్ర్పీత్ బుమ్రా చేపట్టారు. రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దేహ్ ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ కారణంగా రోహిత్ శర్మ మొదటి టెస్టుకు గైర్హాజరయ్యాడు.

Also Read: IND vs AUS Test : సిక్స్ కొట్టి ఆందోళన చెందిన విరాట్ కోహ్లీ.. బాల్ ఎవరికి తాకిందో తెలుసా.. వీడియో వైరల్

తాజాగా హిట్ మ్యాన్ ఆస్ట్రేలియాలోని పెర్త్ లో అడుగు పెట్టారు. పెర్త్ ఎయిర్ పోర్టు నుంచి హోటల్ గదికి వెళ్లేందుకు రోహిత్ కారు వద్దకు వచ్చిన సందర్భంలో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, వచ్చేనెల 6వ తేదీ నుంచి ఆడిలైడ్ లో ప్రారంభమయ్యే రెండో టెస్టులో రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే నాలుగు టెస్టు మ్యాచ్ లకు రోహిత్ శర్మనే సారథ్యం వహించనున్నాడు.

Also Read: AUS vs IND : ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. యశస్వీ జైస్వాల్ సెంచరీ

ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు శనివారం ముంబైలోని ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు రోహిత్ శర్మ తన సతీమణి రితికాతో కలిసి వచ్చారు. ఎయిర్ పోర్టులోకి వెళ్లే సమయంలో రోహిత్ శర్మ తన సతీమణి రితికాకు హగ్ ఇచ్చారు. ఆ తరువాత ఆమె కారులో వెళ్లగా.. రోహిత్ ఎయిర్ పోర్టులోకి వెళ్లి ఆస్ట్రేలియాకు పయణమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.