AUS vs IND : ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. యశస్వీ జైస్వాల్ సెంచరీ

ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ సెంచరీ చేశాడు.

AUS vs IND : ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. యశస్వీ జైస్వాల్ సెంచరీ

Yashasvi Jaiswal

Updated On : November 24, 2024 / 9:35 AM IST

AUS vs IND 1st Test Match: బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మూడో రోజు ఆదివారం ఉదయం 172 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ప్రారంభించారు. అప్పటికే జైస్వాల్ 90 పరుగులు చేయగా.. ఆదివారం మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సమయానికే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  హేజిల్ వుడ్  బౌలింగ్ బ్యాక్ సైడ్ సిక్స్ కొట్టిన జైస్వాల్.. 205 బంతులను ఎదుర్కొని సెంచరీ పూర్తి చేశాడు.

Also Read: Hardik Pandya: టీ20 క్రికెట్‌లో హార్ధిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్ అతనే..

ఆసీస్ పై తొలి టెస్టులోనే శతకం చేసిన మూడో భారత్ బ్యాటర్ గా జైశ్వాల్ రికార్డు నెలకొల్పాడు. అదేవిధంగా ఆస్ట్రేలియాలో అత్యంత పిన్న వయస్సులో (22ఏళ్ల 330 రోజులు) సెంచరీ చేసిన రెండో బ్యాటర్ యశస్వీ జైస్వాల్. అంతకుముందు.. మొదటి 15 టెస్టుల్లో 1500 పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్ గానూ యశస్వీ రికార్డు నమోదు చేశాడు. పుజారా 28 ఇన్నింగ్స్ లలో 1500 పరుగులు చేయగా.. ఇన్నింగ్స్ పరంగా రెండో భారత బ్యాటర్ గా యశస్వీ రికార్డుకెక్కాడు.

Also Read: IND vs AUS : ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. ప‌ట్టుబిగించిన భార‌త్‌.. శ‌త‌కానికి చేరువ‌లో య‌శ‌స్వి జైస్వాల్‌.. లీడ్ 218 రన్స్‌

పెర్త్ లో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. మొదటి ఇన్నిగ్స్ లో కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. జైశ్వాల్, కేఎల్ రాహుల్ వికెట్ పడకుండా రెండోరోజు ఆటను పూర్తి చేశారు. కాగా. ఆదివారం ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. 176 బంతుల్లో ఐదు ఫోర్లు సహాయంతో 77 పరుగులు చేశాడు.