IND vs AUS : ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. ప‌ట్టుబిగించిన భార‌త్‌.. శ‌త‌కానికి చేరువ‌లో య‌శ‌స్వి జైస్వాల్‌.. లీడ్ 218 రన్స్‌

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ప‌ట్టు బిగించింది.

IND vs AUS : ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. ప‌ట్టుబిగించిన భార‌త్‌.. శ‌త‌కానికి చేరువ‌లో య‌శ‌స్వి జైస్వాల్‌.. లీడ్ 218 రన్స్‌

IND vs AUS Day 2 stumps India lead by 218 runs in perth test

Updated On : November 23, 2024 / 3:38 PM IST

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ప‌ట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి టీమ్ ఇండియా 57 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 172 ప‌రుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (62), య‌శ‌స్వి జైస్వాల్ (90) లు ఉన్నారు. ప్ర‌స్తుతం భార‌త్ 218 ప‌రుగుల ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

తొలి ఇన్నింగ్స్‌లో విఫ‌ల‌మైన ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో అద‌ర‌గొట్టాడు. ఆచితూచి ఆడాడు. మంచి బంతుల‌ను గౌర‌విస్తూనే చెత్త బంతుల‌ను బౌండరీల‌కు త‌ర‌లించాడు. ఈ క్ర‌మంలో 123 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. య‌శ‌స్వి టెస్టు కెరీర్‌లో హాఫ్ సెంచ‌రీ మార్క్ చేరుకోవ‌డానికి అత‌డు తీసుకున్న అత్య‌ధిక బంతులు ఇవే కావ‌డం గ‌మ‌నార్హం.

Yashasvi Jaiswal : సిక్స‌ర్ల కింగ్ య‌శ‌స్వి జైస్వాల్‌.. బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ రికార్డు బ్రేక్‌.. ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు..

మ‌రో వైపు తొలి ఇన్నింగ్స్‌లో చూపించిన పోరాట స్పూర్తినే రాహుల్ కొన‌సాగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో వివాదాస్పద నిర్ణ‌యంతో పెవిలియ‌న్‌కు చేరుకున్న రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో చ‌క్క‌గా బ్యాటింగ్ చేశాడు. రాహుల్ 124 బంతుల్లో అర్థ‌శత‌కాన్ని అందుకున్నాడు. వీరిద్ద‌రు ఆసీస్ బౌల‌ర్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా బ్యాటింగ్ చేశారు. ఒక్క వికెట్ కోల్పోకుండా రెండో రోజును ముగించారు.

అంత‌క‌ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఓవ‌ర్ నైట్ స్కోరు స్కోరు 67/7 తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ మ‌రో 37 ప‌రుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో భార‌త్ కు 46 ప‌రుగుల కీల‌క తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 150 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే.

Shreyas Iyer : ఐపీఎల్ వేలానికి ఒక్క రోజు ముందు.. భారీ సెంచ‌రీతో చెల‌రేగిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. కాసుల వ‌ర్షం కురయ‌నుందా?