Yashasvi Jaiswal : సిక్సర్ల కింగ్ యశస్వి జైస్వాల్.. బ్రెండన్ మెక్‌కల్లమ్ రికార్డు బ్రేక్.. ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు..
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు.

Yashasvi Jaiswal Breaks McCullum World Record Of Hitting Most Sixes In A Calendar Year In Tests
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాథన్ లియోన్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన వెంటనే అతడు ఈ ఘనతను సాధించాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
2014లో బ్రెండన్ మెక్‌కల్లమ్ 33 సిక్సర్లు బాదగా తాజా సిక్స్‌తో కలిసి జైస్వాల్ సిక్సర్ల సంఖ్య 34 కి చేరింది. వీరిద్దరి తరువాత బెన్‌స్టోక్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ లు ఉన్నారు.
ఓ క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు..
యశస్వి జైస్వాల్ (భారత్) – 34* సిక్సర్లు (2024లో)
బ్రెండన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్) – 33 సిక్సర్లు (2014లో)
బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) – 26 సిక్సర్లు (2022లో)
ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 22 సిక్సర్లు (2005లో)
వీరేంద్ర సెహ్వాగ్ (భారత్) – 22 సిక్సర్లు (2008లో)
ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లాండ్) – 21 సిక్సర్లు (2004లో)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసింది. ఆ తరువాత ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌కు కీలకమైన 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 55 ఓవర్లలో 171/0 తో ఉంది. కేఎల్ రాహుల్ (62), యశస్వి జైస్వాల్ (89) లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 217 పరుగుల ఆధిక్యంలో ఉంది.
🚨 HISTORY BY JAISWAL 🚨
– Jaiswal has hit most sixes in a calendar year in Test History (34 sixes) pic.twitter.com/G9QvOtvuLa
— Johns. (@CricCrazyJohns) November 23, 2024