Shreyas Iyer : ఐపీఎల్ వేలానికి ఒక్క రోజు ముందు.. భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్.. కాసుల వర్షం?
సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆదివారం (నవంబర్ 23న) ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.

Shreyas Iyer slams 47 ball ton in Syed Mushtaq Ali Trophy a day before IPL auction
సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆదివారం (నవంబర్ 23న) ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు వేలంలో ఉండడంతో ఎవరికి ఎక్కువ మొత్తం లభిస్తుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మెగా వేలానికి ఒక్క రోజు ముందు టీమ్ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ శతకంతో దుమ్మురేపాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటాడు.
హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్ వేదికగా ముంబై, గోవా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై తరుపున శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగాడు. గోవా బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. సిక్సర్లు ఫోర్లు బాదుతూ 47 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 11 ఫోర్లు, 10 సిక్సర్లతో 130 పరుగులుచేశాడు. అయ్యర్‌తో పాటు పృథ్వీషా, అజింక్యా రహానేలు హాఫ్ సెంచరీలతో రాణించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది.
ఐపీఎల్‌లో గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున అయ్యర్ ఆడాడు. అతడి నాయకత్వంలో కేకేఆర్ ఐపీఎల్ 2024 సీజన్ విజేతగా నిలిచింది. అయితే.. మెగా వేలం సందర్భంగా అతడిని కేకేఆర్ వేలంలోకి విడిచిపెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఐపీఎల్ వేలంలో అతడిని దక్కించుకనేందుకు ప్రాంఛైజీలు పోటీపడవచ్చు. కేకేఆర్‌తో పాటు ఢిల్లీ, పంజాబ్ వంటి జట్లు అతడి కోసం భారీ మొత్తాన్ని వెచ్చించే అవకాశం ఉంది. బ్యాటర్‌గానే కాకుండా అతడికి కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
Tilak Varma : చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. టీ20ల్లో వరుసగా మూడో సెంచరీ..
#100@105of70Mumbai @Shreyasian96 @ShreyasIyer15 @Rajiv1841 @ShreyasIyer96FC pic.twitter.com/IbGGTKucUJ
— Groom VJ (@Rishabpant7729) November 23, 2024