Hardik Pandya: టీ20 క్రికెట్‌లో హార్ధిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్ అతనే..
భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య టీ20 క్రికెట్ లో అరుదైన రికార్డును సాధించాడు. తద్వారా ఆ రికార్డు సాధించిన తొలి భారత క్రికెటర్ గా నిలిచాడు.

Hardik Pandya
Hardik Pandya Scripts Massive Record: భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య టీ20 క్రికెట్ లో అరుదైన రికార్డును సాధించాడు. ఆస్ట్రేలియాలో భారత్ జట్టు హల్ చల్ చేస్తుంటే మరోవైపు ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఇతర టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ టీ20 క్రికెట్ లో రాణిస్తున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపీ ఇందుకు వేదికైంది. ఈ టోర్నీలో తొలిరోజే తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్ సహా ఆరుగురు బ్యాటర్లు సెంచరీల మోత మోగించారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సైతం తన సత్తాను చాటాడు. 35 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ టోర్నీలో బరోడా జట్టు తరపున హార్దిక్ పాండ్యా ఆడుతున్నాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును నమోదు చేశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా మొదటి మ్యాచ్ గుజరాత్ జట్టుపై జరిగింది. ఈ మ్యాచ్ లో బరోడా జట్టు విజయం సాధించింది. బరోడా జట్టుకు హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా కెప్టెన్ గా ఉన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన బరోడా జట్టులో శివాలిక్ శర్మ (43 బంతుల్లో 64), హార్దిక్ పాండ్యా (35బంతుల్లో 74) పరుగులు చేయడంతో బరోడా జట్టు విజయం సాధించింది. ఐదు స్థానంలో బ్యాటింగ్ వచ్చిన పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. హార్దిక్ ఇన్నింగ్స్ లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి. ఈ క్రమంలో టీ20 క్రికెట్ లో 5వేల పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత క్రికెటర్ గా పాండ్యా రికార్డుల్లోకెక్కాడు.
టీ20 క్రికెట్ లో 5వేల పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన భారత ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా ఒక్కరే ఉన్నారు.
హార్దిక్ పాండ్య (5,067 పరుగులు, 180 వికెట్లు)
రవీంద్ర జడేజా (3,684 పరుగులు, 225 వికెట్లు)
అక్షర్ పటేల్ (2,960 పరుగులు, 227 వికెట్లు)
కృనాల్ పాండ్య (2,712 పరుగులు, 138 వికెట్లు)
ఇర్ఫాన్ పఠాన్ (2,020 పరుగులు, 173 వికెట్లు)
THE SIX HITTING OF HARDIK PANDYA. 🥶 pic.twitter.com/NeomI5KahR
— Johns. (@CricCrazyJohns) November 23, 2024