Vinod Kambli dances at Thane hospital Chak De song video viral
టీమ్ఇండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన థానెలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒకప్పుడు నడవడానికే ఇబ్బందులు పడిన ఆయన ఇప్పుడు డ్యాన్స్ సెప్టులతో అదరగొడుతున్నాడు. చికిత్సలో భాగంగా వైద్య బృందం ఆయనతో పాటలకు డ్యాన్స్ చేయిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కాంబ్లీ చక్‌దే ఇండియా పాటకు సెప్టులు వేయడాన్ని చూడొచ్చు. ఈ వీడియో చూసిన ఆయన అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Team India : కొత్త ఏడాది ప్రారంభంలోనే టీమ్ఇండియా అభిమానులకు భారీ షాక్..!
ఇటీవల తీవ్ర అస్వస్థతతో కాంబ్లీ థానేలోని లోఖండి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. మూత్ర ఇన్‌ఫెక్షన్, ఇతర సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడి మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాంబ్లీకి ఫ్యాన్స్ అయిన ఆస్పత్రి ఇన్‌చార్జి భారత మాజీ ఆటగాడికి ఎలాంటి పీజులు లేకుండానే చికిత్స చేస్తానని హామీ సైతం ఇచ్చాడు.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలు చిన్ననాటి మిత్రులు. పాఠశాల రోజుల్లో ఈ ఇద్దరూ కలిసి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు. టీమ్ఇండియా తరుపున సైతం వీరిద్దరు కలిసి ఆడారు. అయితే.. క్రమశిక్షణ, నిబద్దతో సచిన్ ఎంతో ఉన్నత స్థానాన్ని చేరుకోగా, ఎంతో ప్రతిభ ఉన్నప్పటికి వ్యవసనాలకు బానిసైన కాంబ్లీ ఆటకు దూరం అవ్వడమే కాకుండా జీవితంలోనూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. చివరికి అనారోగ్యం పాలైయ్యాడు.
Gautam Gambhir : గంభీర్‌కు ఈ సిరీసే ఆఖరిది కానుందా.. సిడ్నీ పరీక్షలో గంభీర్ నెగ్గెనా?
Vinod Kambli danced in the hospital😀 #VinodKambli pic.twitter.com/uYxnZMbY1u
— Cricket Skyblogs.in (@SkyblogsI) December 31, 2024