Team India : కొత్త ఏడాది ప్రారంభంలోనే టీమ్ఇండియా అభిమానులకు భారీ షాక్ తగలనుందా?
కొత్త ఏడాది ప్రారంభంలోనే టీమ్ఇండియా అభిమానులకు భారీ షాక్ తగలనుంది.

Rohit Sharma will be retirement from tests after Sydney match reports
కొత్త ఏడాది ప్రారంభంలోనే టీమ్ఇండియా అభిమానులకు భారీ షాక్ తగలనుంది. గత కొంతకాలంగా ఫామ్ లేమీతో ఇబ్బందులు పడుతున్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జనవరి 3 న ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న సిడ్నీ టెస్టు మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నాడని అంటున్నారు.
తన రిటైర్‌మెంట్ విషయమై ఇప్పటికే రోహిత్ శర్మ బీసీసీఐ ఉన్నతాధికారులు, సెలక్టర్లకు సమాచారం ఇచ్చాడట. అయితే.. రోహిత్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని బీసీసీఐ పెద్దలు అతడికి నచ్చజెప్పారని అయితే రోహిత్ మాత్రం రిటైర్‌మెంట్ కే మొగ్గు చూపినట్లుగా సదరు కథనాలు పేర్కొన్నాయి. ఒకవేళ భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుకుంటే మాత్రం ఫైనల్ మ్యాచ్ అనంతరం రిటైర్ కావాలని హిట్‌మ్యాన్ భావిస్తున్నాడట.
Gautam Gambhir : గంభీర్‌కు ఈ సిరీసే ఆఖరిది కానుందా.. సిడ్నీ పరీక్షలో గంభీర్ నెగ్గెనా?
‘ఫామ్‌లేమీతో రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే టెస్టుకు వీడ్కోలు పలికేందుకు సిద్ధం అయ్యాడు. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరకుంటే సిడ్నీ టెస్టు మ్యాచే అతడికి ఆఖరిది. ఇప్పటికే దీనిపై సెలక్టర్లకు సమాచారం ఇచ్చాడు. అతడి స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా సారథిగా నియమితుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి.’ అని
ఓ బీసీసీఐ సెలక్టర్ చెప్పినట్లుగా ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Team India : డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకునేందుకు భారత్‌కు ఆఖరి ఛాన్స్..? ఎలాగంటే?
రోహిత్ శర్మ టెస్టుల్లో గత 15 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కటే హాఫ్ సెంచరీ చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అతడి ప్రదర్శన ఘోరంగా ఉంది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు దూరం అయిన అతడు మూడు టెస్టుల్లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడు టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకుంటాడని అంటున్నారు. కాగా.. ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం టీ20లకు రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.