England Star Grace Harris
England Star Grace Harris: విమెన్స్ బిగ్ బ్యాష్ లీగ్-2023లో ఇంగ్లండ్ బ్యాటర్ గ్రేస్ హ్యారీస్ విరిగిన బ్యాటుతో సిక్స్ కొట్టింది. నార్త్ సిడ్నీ ఓవల్లో ఇవాళ జరిగిన మ్యాచులో ఈ సీన్ కనపడింది. సిక్సు కొట్టాక బ్యాట్ రెండు ముక్కలైంది. హ్యారీస్ అంబరాన్నంటే ఆనందం వ్యక్తం చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బ్రిస్బేన్ హీట్, పెర్త్ స్కార్చెర్స్ విమెన్ తలపడ్డాయి. తన బ్యాటు కొద్దిగా విరిగిపోయిందని బ్రిస్బేన్ హీట్ బ్యాటర్ హ్యారీస్ కు ముందుగానే తెలుసు. అయినప్పటికీ బ్యాట్ మార్చుకునేందుకు ఆమె ఆసక్తి చూపలేదు.
పెర్త్ స్కార్చెర్స్ బౌలర్ విసిరిన బంతిని అదే బ్యాటుతో సిక్సుగా మలిచింది. రెండు ముక్కలై కింద పడిపోయిన బ్యాటును ఎత్తి చూపించింది. ఈ మ్యాచులో హ్యారీస్ 59 బంతుల్లో 11 సిక్సులు, 12 ఫోర్లతో 136 పరుగులు చేసి, నాటౌట్ గా నిలిచి రికార్డు సృష్టించింది.
డబ్ల్యూబీబీఎల్‌లో చరిత్రలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆమె నిలిచింది. మ్యాచ్ అనంతరం హ్యారీస్ మాట్లాడుతూ నార్త్ సిడ్నీ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని చెప్పింది. కాగా, ఈ మ్యాచులో బ్రిస్బేన్ టీమ్ 229 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో పెర్త్ ధాటిగా రాణించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి, ఓడిపోయింది.
?️ “I need a new bat… nah, stuff it. I’ll hit it anyway”
Absolute gold from Grace Harris ? #WBBL09 pic.twitter.com/ALTwrJOWRH
— Weber Women’s Big Bash League (@WBBL) October 22, 2023
Cricketers Favourite Food : ఈ క్రికెటర్లకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ..