Viral Video Greatest Dropped Catch Effort Is Viral
Viral Video : క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు ఫీల్డింగ్ కూడా ఎంతో ముఖ్యం. మూడు విభాగాల్లో రాణించిన జట్టే విజేతగా నిలుస్తుంది. ఒక్క క్యాచ్ చేజారినా ఒక్కొసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. అది అంతర్జాతీయ మ్యాచ్ అయినా లేదా గల్లీ క్రికెట్ అయినా సరే. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఫీల్డర్ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. ఈ వీడియో చూసిన వారు నవ్వకుండా ఉండలేరు మరీ.
ఇంగ్లాండ్‌లో విలేజ్ క్రికెట్‌లో భాగంగా మెర్టన్ బోర్స్, సందర్ స్టీడ్ క్లబ్ ల మధ్య ఓ మ్యాచ్ జరిగింది. బ్యాటర్ కొట్టిన షాట్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సందర్‌స్టీడ్ ఫీల్డర్ స్టూ ఎల్లెరీ క్యాచ్‌గా అందుకునే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఏడు సార్లు బంతిని పట్టుకోవాలని ప్రయత్నించాడు. అయినప్పటికి ఆ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. దీన్ని రిప్లేలో చూసి ఎల్లెరీ కూడా నవ్వుకున్నాడు.
కేఎల్ రాహుల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? ఆ పోస్టుకు అర్థమేంటో ..
ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నువ్వు తోపు అన్నా.. నీలాంటి ఫీల్డర్ మా జట్టుకు వద్దన్నా అని ఒకరు, పాకిస్తాన్ ఫీల్డింగ్‌ను గుర్తుకుతెచ్చాడు.. ఇది వారికే అంకితం అంటూ మరొక నెటిజన్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
The greatest dropped catch of all time ? pic.twitter.com/ZtIBZ06nUn
— Out Of Context Cricket (@GemsOfCricket) August 21, 2024