Viral Video Shows MS Dhoni Smoking Hookah
MS Dhoni Smoking Hookah : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గెలిచినా, ఓడినా కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలు అతడిలో ఏవీ కనిపించవు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే లక్షణం. మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నా కూడా ఎంతో ప్రశాంతంగా తన ప్రణాళికలను అమలు చేస్తూ కెప్టెన్ కూల్ అని అభిమానులతో పిలిపించుకున్నాడు. క్రికెటర్‌గానే కాదు ధోని వ్యక్తిగత జీవితం కూడా ఎంతో మందికి ఆదర్శం.
అయితే.. ధోనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీని చూసిన కొందరు మహేంద్రుడిని విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఆ వీడియోలో ధోని హుక్కా తాగుతూ కనిపించాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు. కాగా.. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు యాడ్ షూటింగ్‌లో భాగంగా ఇలా చేశాడని అంటే ఇంకొందరు మాత్రం ధోనిని తప్పుబడుతున్నారు. ఎంతో మందికి రోల్ మోడల్ అయిన ధోని ఇలా చేయడం సరికాదని అంటున్నారు.
Rohit Sharma : ముంబై చేరుకున్న రోహిత్ శర్మ.. అఫ్గాన్‌తో టీ20 సిరీస్ ఆడతాడా..!
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్..!
ఈ వీడియో నిజం కాదని ఇంకొందరు వాదిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సాయంతో సృష్టించిన డీప్ ఫేక్ వీడియో అని అంటున్నారు. మరికొందరు మాత్రం ధోనికి కూడా ఓ వ్యక్తిగత జీవితం ఉంటుందని, ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని అంటున్నారు.
జార్జ్ బెయిలీ వ్యాఖ్యలు వైరల్..
కాగా.. ఈ వీడియో వైరల్ నేపథ్యంలో ఆసీస్ మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన జార్జ్ బెయిలీ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ‘ధోనికి పీషా లేదా హుక్కా పీల్చడం అంటే ఇష్టం. అతడి గదిలో హుక్కా సెటప్ కనిపించేది. అందరికి ఇది కనిపించకుండా ఉండేలా ధోని జాగ్రత్తలు కూడా తీసుకోడు. అతడు హుక్కా పీల్చేటప్పుడు యువ ఆటగాళ్లు కూడా సరదాగాకూర్చుంటారు.’ అని బెయిలీ అన్నాడు.
BBL : ఏంటీ భయ్యా.. ఇది ఔటా..? థర్డ్ అంపైరే తప్పు చేస్తే ఇక దిక్కెవరూ..!
Smokey start to 2024 MS Dhoni caught on camera smoking Hookah #Dhoni #Thala #MSDhoni pic.twitter.com/KcDWjhGg2B
— Rosy (@rose_k01) January 6, 2024