పరుగుల యంత్రం.. రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం ఓ అద్భుతమైన రికార్డు ఎదురుచూస్తోంది. లీగ్ ఆరంభం నుంచి జరిగిన మూడు మ్యాచ్‌లలో వరుస పరాజయాలు ఎదుర్కొంది బెంగళూరు. అయినప్పటికీ కోహ్లీ పరుగుల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. దూకుడైన బ్యాటింగ్ చేయకపోయినప్పటికీ ఓ మాదిరి స్కోరుతో రాణిస్తున్నాడు.
Read Also : వచ్చాడు.. వెళుతున్నాడు: మలింగకు ఐపీఎల్ నుంచి బ్రేక్
ఐపీఎల్ సీజన్ 12లో బెంగళూరు జట్టుతో పాటు ఒక్క విజయం కూడా నమోదు చేసుకోలేని రాజస్థాన్ రాయల్స్‌తో పోరాడేందుకు సిద్ధమైపోయింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 63పరుగులు సాధిస్తే.. ఐపీఎల్ టాప్ స్కోరర్‌గా నిలవనున్నాడు. ఇటీవల జరిగిన మ్యాచ్‌లో 5వేల పరుగులు సాధించిన కోహ్లీ.. గతంలో అవే పరుగులు సాధించిన సురేశ్ రైనా కంటే వేగంగా అన్ని పరుగులు చేయగలిగాడు.
ఐపీఎల్‌లో 5003 పరుగులు చేసిన కోహ్లీ.. 4 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ.. ఈ రికార్డు సాధించడానికి రైనా కంటే 13 ఇన్నింగ్స్ తక్కువే తీసుకున్నాడు. ఇక ఏప్రిల్ 2న జరగనున్న మ్యాచ్‌లో కోహ్లీ బ్యాట్ కి పనిచెప్తే ఈ రికార్డు సాధించడం విశేషమేమీ కాదు. మంగళవారం రాజస్థాన్ వేదికగా తలపడి లీగ్ లో తొలి విజయాన్ని దక్కించుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. రాజస్థాన్‌లు ఎదురుచూస్తున్నాయి.
Read Also : వయస్సు దాచే ప్లేయర్లను నిషేదించాల్సిందే..!!