Virat Kohli: హెచ్ఎస్‌బీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీ..

ప్రపంచంలోని ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో ఒకటైన హెచ్ఎస్‌బీసీతో అనుబంధం కలిగి ఉండటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ చెప్పారు.

Virat Kohli

Virat Kohli: హెచ్ఎస్‌బీసీ (HSBC) తన బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని నియమించుకున్నట్లు ప్రకటించింది. హెచ్ఎస్‌బీసీ బ్యాంక్ సేవలను విస్తృతం చేసే లక్ష్యంగా పెట్టుకున్న బ్రాండ్ ప్రచారంలో కోహ్లీ భాగస్వామ్యం అవుతాడని హెచ్ఎస్‌బీసీ పేర్కొంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ -2023 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్నాడు. మొహాలీలో గురువారం పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడనున్న ఆర్సీబీ జట్టులో భాగంగా కోహ్లీ చండీగఢ్ లో ఉన్నారు.

Virat Kohli: కావాల‌ని ఎవ‌రూ నెమ్మ‌దిగా ఆడరు.. స్లో స్ట్రైక్‌రేట్‌ విమ‌ర్శ‌ల‌పై విరాట్ కౌంట‌ర్‌

హెచ్ఎస్‌బీసీ ఇండియాతో కలిసి పనిచేసే విషయంపై విరాట్ కోహ్లీ మాట్లాడారు. ప్రపంచంలోని ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో ఒకటైన హెచ్ఎస్‌బీసీతో అనుబంధం కలిగి ఉండటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. మైదానంలోకి దిగినప్పుడు ప్రేక్షకులు తనపై ఎంతో నమ్మకంతో ఉంటారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా నేను కృషి చేస్తానని అన్నారు. ఇదే సమయంలో నా ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి నేను హెచ్ఎస్‌బీసీ ఇండియాను కేంద్రీకృత, విశ్వసనీయ ఆర్థిక భాగస్వామిగా చూస్తానని కోహ్లీ అన్నాడు.

Virat Kohli: ఐపీఎల్‌లో కోహ్లి న‌యా రికార్డు.. 13 జ‌ట్ల‌పై అర్ధ‌శ‌త‌కాలు

ఐపీఎల్ 2023 సీజన్ లో కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆ జట్టు ఐదు మ్యాచ్ లు ఆడింది. అందులో మూడు మ్యాచ్ లో ఓడిపోగా.. రెండింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.