Virat Kohli: ఐపీఎల్‌లో కోహ్లి న‌యా రికార్డు.. 13 జ‌ట్ల‌పై అర్ధ‌శ‌త‌కాలు

కోహ్లి ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప్రాంచైజీల‌పై అర్ధ‌శ‌త‌కాలు చేసిన ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. 13 వేరు వేరు ఫ్రాంచైజీలపై హాఫ్ సెంచ‌రీలు చేసిన ఏకైక ప్లేయ‌ర్‌గా నిలిచాడు.

Virat Kohli: ఐపీఎల్‌లో కోహ్లి న‌యా రికార్డు.. 13 జ‌ట్ల‌పై అర్ధ‌శ‌త‌కాలు

Virat Kohli

Updated On : April 11, 2023 / 8:45 PM IST

Virat Kohli: టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఐపీఎల్‌లో అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. సోమ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 44 బంతుల‌ను ఎదురొన్న కోహ్లి 4 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 61 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో కోహ్లి ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప్రాంచైజీల‌పై అర్ధ‌శ‌త‌కాలు చేసిన ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు కోహ్లి ఐపీఎల్ ఆడిన 13 వేరు వేరు ఫ్రాంచైజీలపై హాఫ్ సెంచ‌రీలు చేసిన ఏకైక ప్లేయ‌ర్‌గా నిలిచాడు.

ఏ జ‌ట్టుపై ఎన్ని అర్ధ‌శ‌త‌కాలు చేశాడంటే..?

చెన్నైసూప‌ర్ కింగ్స్ పై అత్య‌ధికంగా 9, ఆ త‌రువాత ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై 8, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ పై 5, ముంబై ఇండియ‌న్స్ పై 5, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై 5, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై 4, పంజాబ్ కింగ్స్‌పై 3, గుజ‌రాత్ ల‌య‌న్స్ పై 3, రైజింగ్ పూణె జెయింట్ పై 3, డెక్క‌న్ ఛార్జ‌ర్స్ పై 3, గుజ‌రాత్ టైటాన్స్ పై 2, పూణె వార‌యర్స్ పై 1, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై 1

కోహ్లి ఖాతాలో నాలుగు శ‌త‌కాలు

విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో నాలుగు సెంచ‌రీలు చేశాడు. పంజాబ్ కింగ్స్, గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ల‌పై విరాట్ శ‌త‌కాలు బాదాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కూడా విరాట్ కొన‌సాగుతున్నాడు. అంతేకాదండోయ్ కెప్టెన్‌గా ఎక్కువ ప‌రుగులు చేసిన ఆట‌గాడు కూడా విరాటే.

ఐపీఎల్ ప్రారంభం నుంచి కోహ్లి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. అయిన‌ప్ప‌టికి ఆర్‌సీబీకి క‌ప్పు అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలింది. 2009, 2011, 2016 సీజ‌న్ల‌లో ఆర్‌సీబీ ఫైన‌ల్‌కు చేరిన‌ప్ప‌టికి ఒక్క‌సారి కూడా గెల‌వ‌లేదు. క‌నీసం ఈ సారి అయినా ట్రోఫీని అందుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.