Virat Kohli: కావాల‌ని ఎవ‌రూ నెమ్మ‌దిగా ఆడరు.. స్లో స్ట్రైక్‌రేట్‌ విమ‌ర్శ‌ల‌పై విరాట్ కౌంట‌ర్‌

ల‌క్నోతో మ్యాచులో విరాట్ కోహ్లీ 42 నుంచి 50 ప‌రుగులు చేరుకోవ‌డానికి 10 బంతులు తీసుకున్నాడు. దీంతో కోహ్లి వ్య‌క్తిగ‌త మైలురాళ్ల గురించి ఎక్కువ‌గా ఆందోళ చెందుతున్న‌ట్లు ఉన్నాడు అని సైమ‌న్ డౌల్ వ్యాఖ్య‌నించ‌గా విరాట్ కోహ్లి గట్టి కౌంట‌ర్ ఇచ్చాడు.

Virat Kohli: కావాల‌ని ఎవ‌రూ నెమ్మ‌దిగా ఆడరు.. స్లో స్ట్రైక్‌రేట్‌ విమ‌ర్శ‌ల‌పై విరాట్ కౌంట‌ర్‌

Virat Kohli

Virat Kohli: ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు, కింగ్ కోహ్లి ఆట‌తీరు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సంద‌ర్భానికి త‌గ్గ‌ట్లుగా త‌న‌ని తాను మార్చుకుంటూ నిల‌క‌డ‌గా ప‌రుగులు సాధిస్తూ జ‌ట్టుకు ఎన్నో గొప్ప విజ‌యాలు అందించాడు. ప్ర‌స్తుత ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోహ్లి నాలుగు మ్యాచుల్లో 214 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి.

IPL 2023, RCB vs LSG: ఉత్కంఠ పోరులో బెంగళూరుపై లక్నో విజయం

లక్నో మ్యాచ్‌లో కోహ్లి స్ట్రైక్ రేట్ గురించి న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్‌, కామెంటేట‌ర్ అయిన సైమ‌న్ డౌల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 42 ప‌రుగుల నుంచి అర్ధ‌శ‌త‌కానికి చేరుకోవ‌డానికి 10 బంతులు తీసుకున్నాడు. దీనిపైనే డౌల్ మాట్లాడుతూ.. విరాట్ ఇన్నింగ్స్‌ను ఎక్స్‌ప్రెస్ రైలుగా ప్రారంభించాడు. అయితే.. 42 నుంచి 50 ప‌రుగులు చేరుకోవ‌డానికి 10 బంతులు తీసుకున్నాడు. అత‌డు వ్య‌క్తిగ‌త మైలురాళ్ల గురించి ఎక్కువ‌గా ఆందోళ‌న చెందుతున్న‌ట్లు ఉన్నాడు అని సైమ‌న్ డౌల్ అన్నారు.

Simon Doull: పాకిస్తాన్‌లో జీవించడం జైలులో జీవించడం లాంటిది

దీనిపై విరాట్ కోహ్లి స్పందించాడు. ఒక్కొసారి టీ20ల్లో యాంక‌ర్ ఇన్నింగ్స్‌లు ఆడ‌డం ముఖ్య‌మేన‌ని అన్నాడు. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌కు మాత్ర‌మే అక్క‌డి ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న ఉంటుంది. అందుకు త‌గ్గట్లుగానే బ్యాటింగ్ చేస్తారు. బ‌య‌ట నుంచి చూసే వ్య‌క్తుల‌కు మాత్రం అది అర్ధం కాదు. నెమ్మ‌దిగా ఆడుతున్నాడ‌ని విమ‌ర్శిస్తుంటారు. ఒక‌వేళ ప‌వ‌ర్ ప్లేలో వికెట్ ప‌డ‌క‌పోతే అప్పుడు టాప్ బౌల‌ర్ వ‌స్తాడు. అత‌డు వేసే ఓవ‌ర్‌ను గ‌మ‌నించాల్సి ఉంటుంది. ప్ర‌త్య‌ర్థి బౌలింగ్‌ను అర్ధం చేసుకుంటే మిగ‌తా ఓవ‌ర్ల‌ను సులువుగా ఆడొచ్చు. దాని కోసం స్ట్రైక్‌రేట్‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు బ్యాటింగ్ చేయాల‌ని అనుకుంటారు త‌ప్పితే కావాల‌ని ఎవ‌రూ నెమ్మ‌దిగా ఆడ‌రు అంటూ విరాట్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు.