Virat Kohli : ఐపీఎల్ కెరీర్ గురించి ఐదు ప్ర‌శ్న‌లు అడిగితే.. కోహ్లీ స్కోరు 4/5

ఐపీఎల్ అరంగ్రేటం (2008) నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli) రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌రుపున‌నే ఆడుతున్నాడు.

Virat Kohli Asked 5 Questions About His IPL Career (pic credit@ipl)

  • త‌న ఐపీఎల్ కెరీర్ గురించి కోహ్లీకి 5 ప్ర‌శ్న‌లు
  • నాలుగింటికి క‌రెక్టు ఆన్స‌ర్‌
  • ఓ ప్ర‌శ్న‌కు త‌ప్పు స‌మాధానం

Virat Kohli : ఐపీఎల్ అరంగ్రేటం (2008) నుంచి విరాట్ కోహ్లీ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌రుపున‌నే ఆడుతున్నాడు. 19 సీజ‌న్ల‌లో ఒకే జ‌ట్టు త‌రుపున ఆడిన‌ ఏకైక ఆట‌గాడిగా కోహ్లీ రికార్డుల‌కు ఎక్కాడు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు కోహ్లీ 268 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 260 ఇన్నింగ్స్‌ల్లో 39.9 స‌గ‌టుతో 8730 ప‌రుగులు చేశాడు. ఇందులో 8 శ‌త‌కాలు 64 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఆర్‌సీబీ త‌రుపున కోహ్లీకి ఎన్నో మ‌ధుర జ్ఞాప‌కాలు ఉన్నాయి.

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బ‌రిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను ఓడించి శుభారంభం చేసింది. ఇక త‌మ రెండో మ్యాచ్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ఏప్రిల్ 5న ఆడ‌నుంది. ఈ క్ర‌మంలో మ్యాచ్ మ‌ధ్య‌లో దొరికిన విరామంలో ఆర్‌సీబీ ఆట‌గాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కింగ్ కోహ్లీ కూడా స‌ర‌దాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్నాడు.

Sameer Rizvi : 8.4 కోట్లకు కొన్న చెన్నై వ‌దిలి వేస్తే.. డెడ్ చీప్‌గా స‌మీర్ రిజ్వీని ద‌క్కించుకున్న ఢిల్లీక్యాపిట‌ల్స్‌.. ఎంతో తెలుసా?

ఈ చిట్‌చాట్‌లో అత‌డికి సంబంధించిన ఓ ఐదు ప్ర‌శ్న‌ల‌ను అడుగ‌గా నాలుగింటికి స‌రైన స‌మాధానాలు చెప్పాడు. ఒక దానికి త‌ప్పు స‌మాధానం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ సోష‌ల్ మీడియాలో పంచుకుంది.

ప్ర‌శ్న : ఐపీఎల్‌లో ఎవ‌రి బౌలింగ్‌లో ఫ‌స్ట్ సిక్స్ కొట్టావు?
కోహ్లీ : స‌నత్ జ‌య‌సూర్య‌

ప్ర‌శ్న‌: 2016 ఐపీఎల్ సీజ‌న్‌లో ఫ‌స్ట్ సెంచ‌రీ చేసిన‌ప్పుడు నాన్ స్ట్రైకింగ్‌లో ఉంది ఎవ‌రు?
కోహ్లీ : కేఎల్ రాహుల్

ప్రశ్న : ఐపీఎల్ 2011 సీజ‌న్‌లో మొత్తం ఎన్ని ర‌న్స్ చేశావు?
కోహ్లీ : 505 ర‌న్స్ (వాస్త‌వానికి ఈ సీజ‌న్‌లో కోహ్లీ 557 ప‌రుగులు చేశాడు )

Mohammed Shami : చ‌రిత్ర సృష్టించిన ష‌మీ.. 19 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఏకైక బౌల‌ర్

ప్ర‌శ్న : ఐపీఎల్ 2013 సీజ‌న్‌లో ఎన్ని ప‌రుగులు చేశావు?
కోహ్లీ : 634 ర‌న్స్‌

ప్ర‌శ్న : ఏబీ డివిలియ‌ర్స్‌తో క‌లిసి గుజ‌రాత్ ల‌య‌న్స్ పై 239 ప‌రుగుల భాగ‌స్వామ్యం నిర్మించారు. అయితే.. ఆ స‌మ‌యంలో ఎవ‌రు ఫ‌స్ట్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నారు?
కోహ్లీ : ఏబీ డివిలియ‌ర్స్‌