Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. స్వదేశంలో ఆ మైలురాయి దాటిన ఐదో ఆటగాడిగా ఘనత

స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచులో కోహ్లీ సాధించిన 42 పరుగులతో అతడు టెస్టుల్లో, స్వదేశంలో 4,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

Virat Kohli: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.

Shubman Gill: గిల్ టెస్టుల్లో పదివేల పరుగులు సాధిస్తాడు.. గిల్‌పై ప్రశంసలు కురిపించిన గవాస్కర్

ఈ మ్యాచులో కోహ్లీ సాధించిన 42 పరుగులతో అతడు టెస్టుల్లో, స్వదేశంలో 4,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇంతకుముందు నలుగురు ఆటగాళ్లు మాత్రమే టెస్టుల్లో, స్వదేశంలో నాలుగు వేల పరుగుల మైలురాయిని దాటారు. కోహ్లీ తాజాగా వారి సరసన చేరాడు. శనివారం నాటి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 59 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. దీంతో కోహ్లీ మరిన్ని పరుగులు సాధించే అవకాశం ఉంది. కోహ్లీకంటే ముందు దేశంలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నారు.

Pawan Kalyan : కాపు-బీసీ కలిస్తే మనదే అధికారం, సగం పదవులు బీసీలకే- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

సచిన్ 7,216 పరుగులు, రాహుల్ ద్రావిడ్ 5,598 పరుగులు, సునీల్ గవాస్కర్ 5,067 పరుగులు, వీరేందర్ సెహ్వాగ్ 4,656 పరుగులు సాధించారు. వారి తర్వాత కోహ్లీ నాలుగు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. విరాట్ తర్వాత నాలుగు వేల పరుగుల మైలురాయికి దగ్గరలో ఛటేశ్వర్ పుజారా ఉన్నాడు. పుజారా ఇప్పటివరకు 3,839 పరుగులు సాధించాడు. శనివారం నాటి మ్యాచ్‌లో కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. 14 నెలలు, 16 ఇన్నింగ్స్ తర్వాత కోహ్లీ టెస్టుల్లో అర్ధ సెంచరీ నమోదు చేయడం విశేషం. చివరిగా గత ఏడాది జనవరిలో కోహ్లీ అర్ధ సెంచరీ నమోదు చేశాడు.

 

ట్రెండింగ్ వార్తలు