Indian Cricketers Flag Hoist : లండన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన టీమిండియా

లండన్ నగరంలో టీమిండియా జట్టు జెండా పండుగ చేసుకుంది. బ్రిటీష్ గడ్డపై భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను క్లోహీసేన ఘనంగా జరుపుకుంది.

Virat Kohli & Co celebrate 75th Independence Day : లండన్ నగరంలో టీమిండియా జట్టు జెండా పండుగ చేసుకుంది. బ్రిటీష్ గడ్డపై భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను క్లోహీసేన ఘనంగా జరుపుకుంది. ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టు బస చేసిన హోటల్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. భారత జెండాను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ఎగురవేశారు. టీమ్‌ మేట్లతో కలిసి ‘జన గణ మణ అధినాయక జయహే’ అంటూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా టీమ్ సభ్యులు, వారి కుటుంబసభ్యులతోపాటు ఇతర సిబ్బంది హాజరయ్యారు. జెండా పండుగ అనంతరం ఆటగాళ్ళు 4వ రోజు మ్యాచ్ కోసం లార్డ్స్‌ మైదానానికి బయల్దేరారు.

జెండా పండుగ సందర్భంగా రికార్డు చేసిన వీడియోలో భారతీయ క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కనిపించారు. అయితే ఈ నెల మొదటి వారంలో బ్యాట్స్ మెన్ పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్ వెళ్లారు. ఇప్పటికే వారు తమ ఐసోలేషన్ పీరియడ్‌ను పూర్తి చేసుకున్నారు. ఆగస్టు 25న ప్రారంభమయ్యే 3వ టెస్ట్ మ్యాచ్ ఎంపిక కోసం వీరిద్దరూ అందుబాటులో ఉన్నారు. భారతదేశం స్కోరు 364 చేయగా.. ఇంగ్లాండ్ 391 పరుగులతో 27 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. టీమిండియా 90 ఓవర్లు పూర్తి చేసింది. స్వదేశీ జట్టుకు 250 కంటే ఎక్కువ లక్ష్యాన్ని నిర్దేశించనుంది.


మరోవైపు.. క్రికెటర్లు విదేశీ పర్యటనలో ఉండగా.. భారత ఒలింపియన్లు ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ వారిని కలిశారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం సాయంత్రం ఒలింపియన్లకు ఆతిథ్యం ఇచ్చారు.ఒలింపిక్‌ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు