Virat Kohli is just one big knock away from achieving a new milestone among Indian batters
Virat Kohli : అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ పరుగుల యంత్రం భీకర ఫామ్‌లో ఉన్నాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 91 బంతులు ఎదుర్కొని 93 పరుగులు చేశాడు.
ఇక బుధవారం రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో వన్డే మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తే సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. వరుసగా ఆరు వన్డే మ్యాచ్‌ల్లో ఆరు హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్‌గా కోహ్లీ రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం అతడు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, అజింక్యా రహానే లతో సమానంగా ఉన్నారు. వీరంతా వరుసగా ఐదు వన్డేల్లో ఐదు అర్థశతకాలు బాదారు.
ఇక ఓవరాల్‌గా చూసుకుంటే.. పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు జావేద్ మియాందాద్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు వరుసగా తొమ్మిది వన్డేల్లో యాభైకి పైగా స్కోర్లు సాధించాడు.
SA 20 : సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. కెప్టెన్‌కు తీవ్రగాయం.. టోర్నీ నుంచి ఔట్..
ఆ తరువాతి స్థానంలో మరో పాక్ ఆటగాడు ఇమామ్ ఉల్ హక్ ఉన్నాడు. అతడు వరుసగా ఏడు వన్డే మ్యాచ్‌ల్లో యాభైకి పైగా స్కోర్లు సాధించాడు. కేన్ విలియమ్సన్, షై హోప్, బాబర్ అజామ్, పాల్ స్టిర్లింగ్ , రాస్ టేలర్, క్రిస్ గేల్ వంటి లు వన్డేల్లో వరుసగా ఆరు సార్లు యాభైకి పైగా స్కోర్లు చేసిన వారిలో ఉన్నారు.