×
Ad

Virat Kohli : అర్ష్‌దీప్ సింగ్‌ ర‌న్నింగ్ ను అనుక‌రించిన కోహ్లీ.. వీడియో వైర‌ల్‌

టీమ్ఇండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ ను విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆట‌పట్టించాడు.

Virat Kohli is mimicking Arshdeep Singh running style in practice session

  • జ‌న‌వ‌రి 11 నుంచి కివీస్‌తో వ‌న్డే సిరీస్‌
  • ప్రాక్టీస్ సెష‌న్‌లో అర్ష్‌దీప్ ను ఆట‌ప‌ట్టించిన కోహ్లీ
  • పేస‌ర్ ర‌న్నింగ్ ను అనుక‌రిస్తూ

Virat Kohli : భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌న‌వ‌రి 11 నుంచి మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వ‌న్డే మ్యాచ్‌కు వ‌డోద‌ర ఆతిధ్యం ఇవ్వ‌నుంది. ఈ క్ర‌మంలో రెండు జ‌ట్లు వ‌డోద‌ర‌కు చేరి ప్రాక్టీస్ సెష‌న్స్‌లో పాల్గొంటున్నాయి. ఇక అంత‌ర్జాతీయ క్రికెట్‌లో టెస్టుల‌కు, టీ20ల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన విరాట్ కోహ్లీ ప్ర‌స్తుతం వ‌న్డేల‌ను మాత్ర‌మే ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అత‌డు కూడా జ‌ట్టుతో క‌లిశాడు.

ఇక మైదానంలో ఎంతో అగ్రెసివ్‌గా క‌నిపించే కోహ్లీ (Virat Kohli) బ‌య‌ట ఎంతో స‌ర‌దాగా ఉంటాడు అన్న సంగ‌తి తెలిసిందే. ఇక త‌న స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు ఆట‌ప‌ట్టించ‌డాన్ని చూస్తూనే ఉంటాము. ఇక అత‌డు టీమ్ఇండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ ను ఆట‌పట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Smriti Mandhana : స్మృతి మంధాన‌కు చిరాకు తెప్పించిన కెమెరామెన్.. వీడియో వైర‌ల్‌..

ప్రాక్టీస్ సెష‌న్‌లో కోహ్లీ.. అర్ష్‌దీప్ ర‌న్నింగ్ ను ఇమిటేట్ చేశాడు. దీన్ని చూసిన స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు తెగ‌న‌వ్వుకున్నారు.

భార‌త్, న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్ షెడ్యూల్‌..

* తొలి వ‌న్డే మ్యాచ్ – జ‌న‌వ‌రి 11 (వ‌డోద‌ర‌)
* రెండో వ‌న్డే మ్యాచ్ – జ‌న‌వ‌రి 14 (రాజ్ కోట్‌)
* మూడో వ‌న్డే మ్యాచ్ – జ‌న‌వ‌రి 18 (ఇండోర్‌)

Prithvi shaw : గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో పృథ్వీ షా రొమాన్స్‌.. ఆ దేవుడు రాసిన స్ప్రిప్ట్ అంటూ వీడియో పోస్ట్..