Virat Kohli : కోహ్లీ మూడు, రోహిత్ నాలుగు.. వ‌న్డేల్లో ఆధిపత్యం మామూలుగా లేదుగా..

Virat Kohli-Rohit Sharma : భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు పరుగుల వ‌ర‌ద పారించారు.

Rohit- Kohli

భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు పరుగుల వ‌ర‌ద పారించారు. 11 మ్యాచులు ఆడిన కోహ్లీ 765 ప‌రుగులు చేసి టోర్నీ టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా రోహిత్ శ‌ర్మ 597 ప‌రుగుల‌తో రెండో స్థానంలో నిలిచారు. ఈ మెగాటోర్నీలో అద్భుతంగా రాణించిన కోహ్లీ, శ‌ర్మ‌లు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ‌న్డే ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయారు. ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ మూడు, రోహిత్ శ‌ర్మ నాలుగో స్థానానికి చేరుకున్నాడు.

గిల్ టాప్ ర్యాంక్‌..

ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓ మోస్త‌రుగా రాణించ‌న‌ప్ప‌టికీ గిల్ త‌న అగ్ర‌స్థానాన్ని కాపాడుకున్నాడు. 826 రేటింగ్ పాయింట్ల‌తో మొద‌టి స్థానంలో ఉన్నాడు. 824 రేటింగ్ పాయింట్ల‌తో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం రెండులో కొన‌సాగుతుండ‌గా 791 రేటింగ్ పాయింట్ల‌తో విరాట్ కోహ్లీ మూడు, 769 రేటింగ్ పాయింట్ల‌తో రోహిత్ శ‌ర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లో రాణించిన శ్రేయ‌స్ అయ్య‌ర్ 12వ స్థానానికి చేరుకున్నాడు.

Amelia Kerr : ట‌వ‌ల్‌తో బంతిని ప‌ట్టుకుంది.. భారీ మూల్యం చెల్లించుకుంది.. వీడియో వైర‌ల్‌

టాప్‌-10 వ‌న్డే బ్యాటింగ్ ర్యాంక్సింగ్‌..

శుభ్‌మ‌న్ గిల్ (భార‌త్‌) – 826 పాయింట్లు
బాబ‌ర్ ఆజాం (పాకిస్థాన్‌) – 824
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 791
రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 769
క్వింట‌న్ డికాక్ (ద‌క్షిణాఫ్రికా) – 760
డారిల్ మిచెల్ (న్యూజిలాండ్‌) – 750
డేవిడ్ వార్న‌ర్ (ఆస్ట్రేలియా) -745
వాన్ డ‌ర్ డుసెన్ (ద‌క్షిణాప్రికా) – 735
హ్యారీ ట‌క్క‌ర్ (ఐర్లాండ్‌) – 729
డేవిడ్ మ‌ల‌న్ (ఇంగ్లాండ్‌) – 729

బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌..

వ‌న్డే బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హ‌రాజ్ 741 రేటింగ్ పాయింట్ల‌తో మొద‌టి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా పేస‌ర్ హేజిల్‌వుడ్, భార‌త పేస‌ర్‌ మ‌హ్మ‌ద్ సిరాజ్ లు వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లో కొన‌సాగుతున్నారు. బుమ్రా, కుల్దీప్‌, ష‌మీలు టాప్‌-10లో ఉన్నారు.

టాప్‌-10 బౌలర్లు వీరే..

కేశ‌వ్ మ‌హ‌రాజ్ (ద‌క్షిణాఫ్రికా) – 741
జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 703
మ‌హ్మ‌ద్ సిరాజ్ (భార‌త్‌) – 699
జ‌స్‌ప్రీత్ బుమ్రా(భార‌త్‌) – 685
ఆడ‌మ్ జంపా (ఆస్ట్రేలియా) – 675
ర‌షీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్‌) – 667
కుల్దీప్ యాద‌వ్ (భార‌త్‌) – 667
ట్రెంట్ బౌల్డ్ (న్యూజిలాండ్‌) – 663
షాహీన్ అఫ్రీది (పాకిస్థాన్‌) – 650
మ‌హ్మ‌ద్ ష‌మీ (భార‌త్‌) – 648

ICC World Cup 2023: ప్రపంచ కప్ తరువాత బంగ్లాదేశ్ కెప్టెన్ పై దాడి..! వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే?

ఇక ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ 330 రేటింగ్ పాయింట్ల‌తో మొద‌టి స్థానంలో ఉండ‌గా అఫ్గానిస్థాన్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ న‌బీ రెండు స్థానంలో కొన‌సాగుతున్నాడు. భార‌త్ నుంచి ర‌వీంద్ర జ‌డేజా ప‌దో ర్యాంకులో కొన‌సాగుతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు