భారత జట్టు సారధి విరాట్ కోహ్లీ అరుదైన ఘనతని తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్‌కి బైబిల్‌గా చెప్పుకొనే ప్రతిష్టాత్మక విస్డన్ పుస్తకం క్రికెటర్స్ ఆఫ్ ది డికేడ్‌లో విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా గౌరవంగా భావించే క్రికెటర్స్ ఆఫ్ ది డికేడ్‌గా విస్డన్ ఐదుగురు పేర్లను ప్రకటించింది.
అందులో విరాట్ కోహ్లీకి గౌరవం దక్కింది. విరాట్‌తో పాటు స్టీవ్ స్మిత్, డేల్ స్టెయిన్, ఏబీ డివిలియర్స్, ఎలీస్ పెర్రీకు ఈ ఘనత లభించింది. ఇక విస్డన్ టెస్ట్ టీం ఆఫ్ ది డికేడ్‌లో విరాట్‌తో పాటు.. రవిచంద్రన్ అశ్విన్ చోటు దక్కించుకోగా.. వన్డే టీం ఆఫ్ ది డికేడ్‌లో ముగ్గురు భారతీయులకు చోటు దక్కింది.
వన్డే టీం ఆఫ్ ది డికేడ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలకు స్థానం దక్కింది. మహిళల టీం ఆఫ్ ది డికేడ్‌లో మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి చోటు దక్కించుకున్నారు.