Virat Kohli Receives Throwdowns From Rahul Dravid Ahead Of Day 3 Of Ind Vs Sa 2nd Test
Virat Kohli : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చేస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి టెస్టుకు కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికా, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్టు మ్యాచ్ ఆరంభంలో వెన్నునొప్పి కారణంగా చివరి క్షణంలో ఆటకు కోహ్లీ దూరమయ్యాడు. విరాట్ బదులుగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న కోహ్లీ క్రమంగా ఫిట్ నెస్ సాధిస్తున్నాడు. ఫిట్ నెస్ కోసం నెట్స్‌లో తెగ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.
విరాట్ కోహ్లీ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. త్రోడౌన్ బౌలింగ్ వేస్తున్నాడు. కోహ్లీ ద్రవిడ్ విసిరిన బంతిని ఆడుతున్నాడు. జనవరి 11 నుంచి కేప్ టౌన్ లో ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మూడో టెస్టుకు కోహ్లీ రెడీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కోహ్లీ వెన్ను నొప్పి నుంచి కోలుకుని ప్రాక్టీసులో మంచి ఫిట్ నెస్ సాధిస్తే.. టీమిండియా జట్టుకు మంచి శుభపరిణామమే..
Kohli receiving throwdowns from Dravid pic.twitter.com/uY3h8cd8Fj
— Benaam Baadshah (@BenaamBaadshah4) January 5, 2022
మూడో టెస్టుకు కోహ్లీ అందుబాటులోకి వస్తే.. అతడి కెరీర్‌లో ఆడే 99వ టెస్టు మ్యాచ్ కానుంది. జోహన్నెస్ బర్గ్ టెస్టులో టీమిండియా… 240 విజయలక్ష్యాన్ని దక్షిణాఫ్రికాకు నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు సాధించింది. ఈ టెస్టులో టీమిండియా విజయం సాధించాలంటే మరో 8 వికెట్లు తీయాల్సి ఉంటుంది. కోహ్లీ ప్రాక్టీస్ చేసే వీడియో ఇదే..
Read Also : Novak Djokovic : జొకోవిచ్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. ఎయిర్ పోర్టులోనే నిలిపేశారు..!