Virat Kohli (Image Credit To Original Source)
Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డును అధిగమించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో 93 పరుగులు చేసి.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
ఇప్పటిదాకా ఈ జాబితాలో రెండో స్థానంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర (28,016 పరుగులు) ఉండేవాడు. న్యూజిలాండ్‌పై కోహ్లీ 42 పరుగులు చేసినప్పుడు అతడి పరుగులు 28,017కి చేరాయి. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో లెజెండరీ సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక రన్స్ కోహ్లీవే.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్
అత్యంత వేగంగా 28,000 అంతర్జాతీయ రన్స్
అత్యంత వేగంగా 28,000 అంతర్జాతీయ రన్స్ చేరిన ఆటగాడిగానూ కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. 624వ ఇన్నింగ్స్‌లో ఈ ల్యాండ్ మార్క్ చేరి, 644 ఇన్నింగ్స్‌లో 28,000 రన్స్ సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.
28,000 అంతర్జాతీయ రన్స్ చేరిన బ్యాట్స్‌మన్‌లు