Virat Kohli: ఐపీఎల్ 2022లో మూడోసారి గోల్డెన్ డక్‌గా విరాట్

ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం రసవత్తర మ్యాచ్ మొదలైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్న ఈమ్యాచ్‌లో..

 

 

Virat Kohli: ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం రసవత్తర మ్యాచ్ మొదలైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్న ఈమ్యాచ్‌లో.. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫా డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కి ఓపెనర్లుగా విరాట్, డుప్లెసిస్ లు దిగారు. ఈ క్రమంలో మరోసారి విరాట్ గోల్డెన్ డక్ గా వెనుదిరగడం గమనార్హం. ప్రస్తుత సీజన్లో కోహ్లీ గోల్డెన్ డక్ కావడం మూడోసారి.

హైదరాబాద్ జట్టు బౌలింగ్ లో రెండుసార్లు, లక్నో జట్టు బౌలింగ్ లో ఓసారి గోల్డెన్ డక్ అయ్యాడు. కాకపోతే మూడు సార్లు ముంబైలో జరిగిన మ్యాచ్ లలోనే ఈ పరాభవాన్ని మూటగట్టుకున్నాడు.

Read Also : ఎట్టకేలకు.. విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ

ఐపీఎల్‌‌లో విరాట్ గోల్డెన్ డక్ అయిన వివరాలు:
Bengaluru వేదికగా 2008వ సీజన్లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో (Ashish Nehra బౌలింగ్)
Bengaluru వేదికగా 2014వ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో జరిగిన మ్యాచ్ లో (Sandeep Sharma బౌలింగ్)
Kolkata వేదికగా 2017వ సీజన్లో KKRతో జరిగిన మ్యాచ్ లో (Nathan Coulter-Nile బౌలింగ్)
Mumbai వేదికగా 2017వ సీజన్లో LSG తో జరిగిన మ్యాచ్ లో DYP 2022 (Dushmanta Chameera బౌలింగ్)
Mumbai వేదికగా 2017వ సీజన్లో SRHతో జరిగిన మ్యాచ్ లో BS 2022 (Marco Jansen బౌలింగ్)
Mumbai వేదికగా 2017వ సీజన్లో SRHతో జరిగిన మ్యాచ్ లో WS 2022 (J Suchith బౌలింగ్)

ట్రెండింగ్ వార్తలు