నెటిజన్ల ట్రోలింగ్: కోహ్లీ.. చెమ్మ చెక్క డ్యాన్స్ చూశారా

ఐపీఎల్ సీజన్ 12 ఆరంభమైనప్పటి నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎంత ప్రయత్నించినా ఏదో విభాగంలో వైఫల్యం కనిపిస్తూనే ఉంది. వరుస పరాజయాలను మూటగట్టుకున్న బెంగళూరు లీగ్ పట్టికలో ఆఖరి నుంచి మొదటి స్థానంలో కొనసాగుతోంది. 4 మ్యాచ్ ల ఓటమి అనంతరం ఐదో మ్యాచ్ లోనైనా గెలిచి పరువు కాపాడుకుందామని ప్రయత్నించిన ఆర్సీబీ మళ్లీ చుక్కెదురైంది. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్ గెలిస్తేనే అర్హత సాధించగలదు. 

ఈ వరుస ఓటములపై ఆర్సీబీ జట్టును నెటిజన్లు ఆడుకుంటున్నారు. స్పూఫ్ వీడియోలను చిత్రీకరించి కెప్టెన్ కోహ్లీపై ట్రోలింగ్ చేస్తున్నారు. స్టార్ బ్యాట్స్ మెన్ డివిలియర్స్, విరాట్ కోహ్లీ పేలవ ఆటతీరును ఫోకస్ చేస్తూ.. ట్విట్టర్ లో ఆడుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే మరికొందరు మాత్రం కోహ్లీ జట్టుపై సానుభూతి తెలియజేస్తున్నారు. తర్వాత జరిగే మ్యాచ్ నుంచి వరుస విజయాలు అందుకుని ప్లే ఆఫ్ కు చేరుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 23న తొలి మ్యాచ్ నుంచి ఏప్రిల్ 5వరకూ కోహ్లీ సేన ఆడిన 5 మ్యాచ్ లలోనూ ఘోర పరాజయం ఎదుర్కొంది.