Virender
Boy Bath On Buffalo : టీమిండియా డాషింగ్ ఓపెనర్ గా పేరు సంపాదించిన సెహ్వాగ్ చేసిన ఓ పోస్టు అలరిస్తోంది. క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. నగరాల ప్రజలకు ఈ వినోదం తెలియదంటూ..క్యాప్షన్ జత చేశారు. చాలా మంది లైక్ కొట్టగా..నెటిజన్లు సరద సరదా కామెంట్స్ చేస్తున్నారు. మరెందరో దీనిని షేర్ చేస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్…క్రికెట్ నుంచి రిటైర్ తీసుకున్న ఈయన సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. సరదా కామెంట్స్, ఫొటోలు, వీడియోలు పోస్టులు చేస్తుంటారు. పదునైన రాతలు కూడా పోస్టు చేస్తుంటారు.
Read More : WhatsApp: వాట్సప్ కాల్ రికార్డ్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?
విమర్శలకు ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగానే జవాబు ఇస్తుంటారు. సెహ్వాగ్ ను చాలా మందే ఫాలో అవుతుంటారు. తాజాగా..ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో బర్రెపై నిలబడి ఓ బుడ్డోడు స్నానం చేస్తున్నాడు. పైపు సహాయంతో బర్రెపై నీళ్లు పోస్తూ..అతను కూడా పోసుకుంటూ..స్నానం చేస్తున్నాడు. ఒక్కోసారి బర్రెపై పడుకోవడం, నిలబడడం..డ్యాన్స్ చేస్తూ..స్నానం చేస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో ప్రముఖ నటుడు ‘రాజేష్ ఖన్నా’ నటించిన ‘అందాజ్’ చిత్రంలోని పాట ‘జిందగీ ఏక్ సఫర్..హై సుహానా’ పాట వస్తోంది. ఈ వీడియో సెహ్వాన్ దృష్టికి వచ్చింది. పల్లె జీవితం..నగర ప్రజలకు ఈ వినోదం తెలియదు అంటూ సెహ్వాగ్ రాసుకొచ్చారు.