Wanindu Hasaranga steps down as Sri Lanka T20I captain
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శన చేసింది. వనిందు హసరంగ నేతృత్వంలోని లంక జట్టు కనీసం సూపర్ 8కి చేరకుండానే గ్రూప్ దశ నుంచి నిష్ర్కమించింది. ఈ నేపథ్యంలో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కోచ్ క్రిస్ సిల్వర్‌హుడ్ తన పదవి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి వనిందు హసరంగ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి హసరంగ తప్పుకున్నాడు. అయితే.. జాతీయ జట్టు తరుపున ఎల్లప్పుడూ తన అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని, నూతన కెప్టెన్‌కు తన మద్దతు ఉంటుందని హసరంగ చెప్పినట్లుగా పేర్కొంది. కాగా.. భారత జట్టు పర్యటకు 15 రోజుల ముందు హసరంగా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.
Brian Lara : లారా 400 పరుగుల రికార్డును బద్దలు కొట్టే భారత ఆటగాళ్ల ఎవరంటే..?
లంకలో టీమ్ఇండియా పర్యటన జూలై 26 నుంచి ఆరంభం కానుంది. ఈ లోపు కొత్త కెప్టెన్ ఎవరు అనేది లంక బోర్డు ప్రకటించనుంది.
శ్రీలంకతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. టీ20లు జూలై 27, 28, 30 తేదీల్లో వన్డేలు ఆగస్టు 2, 4, 7 తేదీల్లో జరగనున్నాయి. ఈ సిరీస్‌తో భారత ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రయాణం మొదలు కానుంది. ఈ సిరీస్‌లకు త్వరలోనే బీసీసీఐ జట్లను ప్రకటించే అవకాశముంది.