×
Ad

IND vs NZ : ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్..

రాజ్‌కోట్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో ఓడిపోయిన బాధ‌లో ఉన్న భార‌త జ‌ట్టుకు (IND vs NZ ) మ‌రో షాక్ త‌గిలింది.

Washington Sundar ruled out of the five match T20 series against New Zealand due to side strain

IND vs NZ :  రాజ్‌కోట్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో ఓడిపోయిన బాధ‌లో ఉన్న భార‌త జ‌ట్టుకు మ‌రో షాక్ త‌గిలింది. తొలి వ‌న్డేలో గాయం కార‌ణంగా మిగిలిన రెండు వ‌న్డేల నుంచి త‌ప్పుకున్న ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఇప్పుడు కివీస్‌తో జ‌న‌వ‌రి 21 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కు దూరం అయ్యాడు. అంతేకాదండోయ్‌..  ఫిబ్ర‌వ‌రి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో అత‌డు ఆడ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు.

జనవరి 11న వడోదర వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మొద‌టి వ‌న్డే మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండ‌గా.. వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఎడ‌మ వైపు ప‌క్క‌టెముక‌ల ప్రాంతంలో తీవ్ర‌మైన నొప్పితో ఇబ్బంది ప‌డ్డాడు. దీంతో అత‌డు వెంట‌నే మైదానాన్ని వీడాడు.

IND vs NZ : మేము ఎలా గెలిచామో తెలుసా.. న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్‌వెల్ కామెంట్స్ వైర‌ల్‌

అయితే.. లక్ష్య ఛేద‌న‌లో అత‌డి అవ‌స‌రం ఉండ‌డంతో ఇబ్బంది ప‌డుతూనే బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ అనంత‌రం అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి స్కానింగ్ నిర్వ‌హించ‌గా గాయం తీవ్ర‌మైన‌ది కావ‌డంతో అత‌డు టీ20 సిరీస్ నుంచి కూడా త‌ప్పుకున్నాడు.

కాగా.. సుంద‌ర్ స్థానంలో ఇప్ప‌టి వ‌ర‌కు బీసీసీఐ ఇంకా ఎవ‌రిని ప్ర‌క‌టించ‌లేదు. ఇప్ప‌టికే శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్న కార‌ణంగా హైద‌రాబాద్ యువ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ న్యూజిలాండ్‌తో మొద‌టి మూడు టీ20ల‌కు దూరం అయిన సంగ‌తి తెలిసిందే. స్వ‌దేశంలో ప్ర‌పంచ‌క‌ప్ ముంగిట ఆట‌గాళ్ల గాయాలు టీమ్ఇండియాను ఇబ్బంది పెడుతున్నాయి.

Mohammad Rizwan : రిజ్వాన్‌కు ఘోర అవ‌మానం.. బ్యాటింగ్ చేస్తుండ‌గా.. రిటైర్డ్ ఔట్‌గా ర‌మ్మ‌ని పిలుపు.. చేసేది లేక‌..

రియాన్‌ పరాగ్‌కు ఛాన్స్‌?

సుంద‌ర్ గాయ‌ప‌డి జ‌ట్టుకు దూరం కావ‌డంతో అత‌డి స్థానంలో రియాన్ ప‌రాగ్ జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని క్రికెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు. అలా కాకుండా వ‌న్డేల్లో సుంద‌ర్ స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన ఆయుశ్ బ‌దోనిని టీ20 సిరీస్ కు కూడా కొన‌సాగించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.