Wasim Akram wife Shaniera slams social media account for including her husband in Divorced XI
సోషల్ మీడియాలో ఒక ట్రోల్ ఖాతాపై పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ భార్య షానియేరా మండిపడింది. డివోర్స్ ఎలెవన్‌లో తన భర్త పేరును చేర్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ క్రికెట్’ అనే సోషల్ మీడియా ఖాతాలో ‘డివోర్స్డ్’ ఎలెవన్ అంటూ విడాకులు తీసుకున్న క్రికెట్ ఆటగాళ్లకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. ఇందులో చాలా మంది గొప్ప క్రికెటర్లు ఉన్నారు. ఈ పోస్ట్‌లో భారత దిగ్గజాలు రవిశాస్త్రి , జవగళ్ శ్రీనాథ్ , దినేష్ కార్తీక్ , శిఖర్ ధావన్ వంటి వారు ఉన్నారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన భార్యతో విడిపోతున్నాడు అనే వార్తల నేపథ్యంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా చేర్చారు.
KL Rahul : ఎంత మాటన్నావ్ రాహుల్.. విరాట్ కోహ్లీ, ధోనిలు కాదా.. ఆ విషయంలో రోహితే తోపా?
Hey @GemsOfCricket You guys are definitely “out of context” and from what I can see you’re also out of correct and reliable information! 👏🏼 https://t.co/kn68XKh6xv
— Shaniera Akram (@iamShaniera) February 25, 2025
వీరితో పాటు ఈ జాబితాలో అక్రమ్ కూడా ఉన్నాడు. ఈ లిస్ట్‌లో తన భర్త పేరును చేర్చడంపై అక్రమ్ భార్య షానియేరా ఆగ్రహం వ్యక్తం చేసింది. అది తప్పుడు సమాచారం అని ఆమె చెప్పుకొచ్చింది.
అక్రమ్ వ్యక్తిగత జీవితం..
అక్రమ్ వ్యక్తిగత జీవితం గురించి చూసుకుంటే.. అతను మొదట 1995 లో హుమా ముఫ్తీని పెళ్లి చేసుకున్నాడు. 14 సంవత్సరాల వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమారులు జన్మించారు. దురదృష్టవశాత్తు ముఫ్తీ 2009లో మరణించింది. ఆ తరువాత 2013లో ఆస్ట్రేలియాకు చెందిన షానియెరా థాంప్సన్‌ను రెండో వివాహం చేసుకున్నాడు అక్తర్. వీరిద్దరు తొలిసారి మెల్‌బోర్న్‌లో కలుసుకున్నారు. ఈ జంటకు డిసెంబర్ 2014లో ఒక కుమార్తె జన్మించింది. ప్రస్తుతం వీరిద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు.
Champions Trophy 2025 : సెమీస్ నుంచి పాక్ నిష్క్రమణ పై మౌనం దాల్చిన పీసీబీ.. వెనుక ఇంత కథ ఉందా?
పాకిస్తాన్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటే.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో రిజ్వాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ పేలవ ప్రదర్శన చేసింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గ్రూప్ స్టేజీ నుంచి నిష్ర్కమించింది. తొలుత న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్.. ఆ తరువాత భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.