KL Rahul : ఎంత మాట‌న్నావ్ రాహుల్‌.. విరాట్ కోహ్లీ, ధోనీలు కాదా.. ఆ విష‌యంలో రోహిత్ శర్మే తోపా?

కేఎల్ రాహుల్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంట‌ర్వ్యూలో రాహుల్ చెప్పిన స‌మాధానాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

KL Rahul : ఎంత మాట‌న్నావ్ రాహుల్‌.. విరాట్ కోహ్లీ, ధోనీలు కాదా.. ఆ విష‌యంలో రోహిత్ శర్మే తోపా?

The smartest cricket brain according to KL Rahul is

Updated On : February 26, 2025 / 2:33 PM IST

భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో విరాట కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, ఎంఎస్ ధోని లు త‌మ పేర్ల‌ను సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించుకున్నారు. ఈ ముగ్గురు ఆట‌గాళ్లు.. కెప్టెన్లుగానే కాకుండా ప్లేయ‌ర్లుగా టీమ్ఇండియాకు ఎన్నో మ‌రుపురాని విజ‌యాల‌ను అందించారు. భార‌త క్రికెట్ పై త‌మ‌దైన ముద్ర‌ను వేశారు. ఇక ఈ ముగ్గురి శైలి విభిన్నం.. ఒక‌రు తెలివితో వ్యూహాలు ర‌చిస్తే, మ‌రొక‌రు దూకుడుతో, ఇంకొక‌రు హార్డ్ హిట్టింగ్‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను బోల్తా కొట్టిస్తూ ఉంటారు.

తాజాగా వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్‌కు ఓ ప్ర‌శ్న ఎదురైంది. స్మార్టెస్ట్ క్రికెట్ బ్రెయిన్ ఎవ‌రిది అనే ప్ర‌శ్న‌ రాహుల్‌ను అడిగారు. ఇందుకు రాహుల్ ఇచ్చిన స‌మాధానం ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుత టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అని రాహుల్ స‌మాధానం చెప్పాడు.

Champions Trophy 2025 : సెమీస్ నుంచి పాక్ నిష్క్ర‌మ‌ణ పై మౌనం దాల్చిన పీసీబీ.. వెనుక ఇంత క‌థ ఉందా?

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు తాను ఎదుర్కొన్న క‌ఠిన‌మైన బౌల‌ర్ ర‌షీద్ ఖాన్ అని చెప్పాడు. ఇక భార‌త బౌల‌ర్ల‌లో నెట్స్‌లో మ‌హ్మ‌ద్ ష‌మీని ఎదుర్కొనేందుకు క‌ష్ట‌ప‌డిన‌ట్లు తెలిపాడు.

బెస్ట్ విన్నింగ్ ప‌ర్సంటేజ్‌..

ఐసీసీ ప‌రిమిత ఓవ‌ర్ల టోర్న‌మెంట్ల‌లో రోహిత్ శ‌ర్మ అత్యుత్త‌మ సార‌థిగా నిలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో 27 మ్యాచ్‌లు ఆడగా ఇందులో 24 మ్యాచ్‌ల్లో భార‌త్ గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల్లో భార‌త్ ఓడిపోయింది. ఈ క్ర‌మంలో ఐసీసీ టోర్న‌మెంట్ల చ‌రిత్ర‌లో బెస్ట్ విన్నింగ్ ప‌ర్సంటేజ్‌ సొంతం చేసుకున్న నాయ‌కుడిగా రోహిత్ నిలిచాడు. అత‌డి విజ‌య‌శాతం 88.88గా ఉంది.

IND vs NZ : వ‌ర్షం కార‌ణంగా భార‌త్‌, న్యూజిలాండ్ మ్యాచ్ ర‌ద్దైతే.. ప‌రిస్థితి ఏంటి? సెమీస్‌లో ఎవ‌రికి లాభం ?

కేఎల్ రాహుల్ ప్ర‌స్తుతం ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో బిజీగా ఉన్నాడు. భార‌త జ‌ట్టు వ‌రుస‌గా బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ల‌ను ఓడించి సెమీస్‌కు చేరుకుంది. భార‌త విజ‌యాల్లో రాహుల్ త‌న వంతు పాత్ర పోషిస్తున్నాడు. గ్రూప్ స్టేజీలో భార‌త్ త‌న చివ‌రి మ్యాచ్‌ను మార్చి2న ఆడ‌నుంది. దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.