Mohammed Siraj: హిందీలో మాట్లాడిన హైదరాబాదీ.. ఇంగ్లిష్‌లో బుమ్రా ట్రాన్స్‌లేషన్.. నవ్వులే నవ్వుల్..

వికెట్‌పై అంచనాకు వస్తామని బుమ్రా కూడా చెప్పాడు. ఇది తమకు బాగా ఉపయోగపడుతుందని తెలిపాడు.

Mohammed Siraj-Jasprit Bumra

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు బ్యాటర్ల వెన్ను విరిచిన హైదరాబాదీ, టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ మ్యాచ్ తర్వాత మాట్లాడాడు. రెండో టెస్ట్ మ్యాచులో పేసర్లు అదరగొట్టడంతో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

మ్యాచ్ అనంతరం సిరాజ్ హిందీలో మాట్లాడగా, బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేషన్ చేస్తూ చెప్పాడు. బుమ్రా గురించి, అతడి నుంచి నేర్చుకున్న తీరును గురించి సిరాజ్ మాట్లాడాడు. దీంతో అనువాదం చేస్తున్న బుమ్రా తన గురించి తానే చెప్పుకోవాల్సి వచ్చింది.

సిరాజ్ హిందీలో ఏం మాట్లాడాడు?

‘మైదానంలో బుమ్రా భాయ్ బౌలింగ్ మొదలుపెట్టిన సమయంలోనే అది ఎటువంటి వికెట్ అనే విషయంపై నాకు స్పష్టతనిస్తాడు. దానికి ఎంత లెంగ్త్ తీసుకుంటే మంచిదనే విషయం తెలిసిపోతుంది. దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇక నేను నా బౌలింగ్ సమయంలో అంతగా ఆలోచించే అవసరం ఉండదు.

మైదానంలో బుమ్రా కూడా ఉంటే నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది’ అని సిరాజ్ చెప్పాడు. దీంతో సిరాజ్ తన గురించి చెప్పిన విషయాన్నే బుమ్రా ట్రాన్స్‌లేషన్ చేయాల్సి వచ్చింది. సిరాజ్, బుమ్రా ఇద్దరూ ఫాస్ట్ బౌలర్లే. మైదానంలో ఇద్దరమూ ఉంటే బౌలింగ్ చేసే సమయంలో తాము ఇద్దరం.. ఒకరి బౌలింగ్‌ను మరొకరం గమనించి వికెట్‌పై అంచనాకు వస్తామని బుమ్రా కూడా చెప్పాడు. ఇది తమకు బాగా ఉపయోగపడుతుందని తెలిపాడు.

Rohit Sharma: మమ్మల్నే అంటారా? అంటూ రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్