IPL 2025: ఇలాగైతే పరుగుల వరద.. ఈ ఐపీఎల్‌లో స్కోరు 300 దాటిపోతుంది: ఏబీ డివిలియర్స్‌

బ్యాట్స్‌మెన్‌కు స్వేచ్ఛ వస్తున్నటికీ ఇది బౌలర్లకు శాపంగా ఉంటుందని చెప్పారు.

ఐపీఎల్‌ 2025 శనివారం నుంచి ప్రారంభం కానుంది. గత ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్‌ ఓ మ్యాచులో 287/3 పరుగులు బాదింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఐపీఎల్‌ 2025లో స్కోరు 300 మార్కును దాటుతుందని మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ అంటున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏబీ డివిలియర్స్‌ మాట్లాడుతూ.. ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా వచ్చిన రజత్ పటీదార్‌కు కూడా పలు సూచనలు చేశారు. ఫాఫ్ డుప్లెసిస్, కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్ల అడుగు జాడల్లో రజత్‌ పటీదార్‌ ఎలాంటి భయమూ లేకుండా ముందుకు వెళ్లాలని చెప్పారు.

Also Read: IPL 2025లో 10 మంది కెప్టెన్లలో కాస్ట్లీయస్ట్‌ కెప్టెన్‌ ఎవరు? అతి తక్కువ ఎవరికి? ఫుల్‌ డీటెయిల్స్..

కోహ్లీ చుట్టే టీమ్‌ ఉంటుందన్న విషయంలో అనుమానం ఏమీ లేకపోయినప్పటికీ రజత్ టీమ్‌కు సంబంధించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని ఏబీ డివిలియర్స్‌ అన్నారు. రజత్‌ తాను టీమ్‌కు చేస్తున్న సూచనలు సరైనవేనా అని ఆలోచిస్తూ కూర్చోకూడదని ఆయన చెప్పారు.

కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే ఇప్పుడు ఏం చేసేవాడు అన్న ఆలోచనలు చేస్తే అవి అడ్డంకిగా మారతాయని ఏబీ డివిలియర్స్‌ తెలిపారు. ఇటువంటి ఛాలెంజ్‌లను అధిగమించడానికి మరోలా ఆలోచించాలని, తనను కెప్టెన్‌గా ఎందుకు ఎంపిక చేశారన్న విషయాన్ని ఆలోచించాలని అన్నారు.

తనను కెప్టెన్‌గా ఎంపిక చేయడం వెనుక మంచి కారణం ఉందన్న విషయాన్ని గుర్తించాలని ఏబీ డివిలియర్స్‌ చెప్పారు. రజత్ పటీదార్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. సీనియర్ల నుంచి సూచనలు తీసుకోవడంలోనూ ఎలాంటి తప్పులేదని తెలిపారు.

కాగా, ఐపీఎల్‌లో ఇంపాక్ట్ నిబంధన వల్ల గేమ్ మారిపోయందని, టాప్‌ 3 బ్యాట్స్‌మెన్ రిస్క్ తీసుకొనే ఛాన్స్ పెరిగిందని ఏబీ డివిలియర్స్‌ అన్నారు. అలాగే, ఫీల్డింగ్‌ రూల్స్‌ మారిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. బ్యాట్స్‌మెన్‌కు స్వేచ్ఛ వస్తున్నటికీ ఇది బౌలర్లకు శాపంగా ఉంటుందని చెప్పారు. దీంతో ఐపీఎల్‌ 2025లో 300కు పైగా స్కోర్లు నమోదవుతాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు.