IND vs WI : ప‌క్కా ఫ్లాన్‌తోనే భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్‌.. ఏడాదిన్న‌ర త‌రువాత స్టార్ ప్లేయ‌ర్ రీఎంట్రీ..

అక్టోబ‌ర్ 2 నుంచి భార‌త్, వెస్టిండీస్ (IND vs WI) జ‌ట్ల మ‌ధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

West Indies Announces Squad For Test Series Against India

IND vs WI : త్వ‌ర‌లో వెస్టిండీస్ జ‌ట్టు భార‌త ప‌ర్య‌ట‌న‌కు రానుంది. ఆతిథ్య భార‌త్‌తో వెస్టిండీస్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడ‌నుంది. ఈ సిరీస్ అక్టోబ‌ర్ 2 నుంచి ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. 15 మందితో కూడిన స‌భ్యుల బృందాన్ని ఎంపిక చేసింది. ఈ జ‌ట్టుకు రోస్ట‌న్ ఛేజ్ నాయ‌క‌త్వం వ‌హిస్తాడు. జోమెల్ వారికన్ వైస్ కెప్టెన్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నాడు.

మాజీ కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌పై వేటు ప‌డింది. అంతేకాదండోయ్‌.. చివరిగా ఆస్ట్రేలియాతో ఆడిన కేసీ కార్టీ, జొహాన్‌ లేన్‌, మికైల్‌ లూయీస్‌లకు కూడా చోటుద‌క్క‌లేదు.

Handshake Row : ఐసీసీ యూటర్న్‌..! పాక్‌కు స్వ‌ల్ప విజ‌యం.. ఆండీ పైక్రాఫ్ట్‌ ఎంత ప‌నాయే..

ఏడాదిన్న‌ర త‌రువాత రీఎంట్రీ..

తొలిసారిగా టెస్టు జ‌ట్టులోకి లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఖారీ పియరి చోటు ద‌క్కించుకున్నాడు. ఇటీవల జరిగిన వెస్టిండీస్‌ చాంపియన్‌షిప్‌లో 41 వికెట్లతో అత‌డు స‌త్తా చాట‌డంతో జాతీయ జ‌ట్టులోకి పిలుపు అందుకున్నాడు. దాదాపు ఏడాదిన్న‌ర త‌రువాత తేజ్‌న‌రైన్ చంద్ర‌పాల్ జ‌ట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

భార‌త్‌తోని పిచ్‌లు ఎక్కువ‌గా స్పిన్న‌ర్ల‌కు అనుకూలం కావ‌డంతో పేసర్‌ గుడకేశ్‌ మోటికి విండీస్ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చిన‌ట్లు తెలిపింది. అల్జారీ జోసెఫ్‌, షమార్‌ జోసెఫ్‌, ఆండర్సన్‌ ఫిలిప్‌, జేడన్‌ సీల్స్ లు పేస‌ర్ల విభాగంలో చోటు ద‌క్కించుకున్నారు.

భార‌త్‌తో టెస్టు సిరీస్ కోసం వెస్టిండీస్‌ జట్టు ఇదే..

రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్ కెప్టెన్), కెమెలాన్‌ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్‌బెల్, తగెనరైన్ చందర్‌పాల్‌, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియర్రి, జేడన్‌ సీల్స్‌.

Suryakumar Yadav : ఒమ‌న్‌తో మ్యాచ్.. భారీ రికార్డు పై క‌న్నేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌..

టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి టెస్టు – అక్టోబ‌ర్ 2 నుంచి 6 వ‌ర‌కు (అహ్మ‌దాబాద్ వేదిక‌గా)
* రెండో టెస్టు – అక్టోబ‌ర్ 10 నుంచి 14 వ‌ర‌కు (ఢిల్లీ వేదిక‌గా)